మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డుల గాలింపు

కాకినాడ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాకినాడ సముద్రంలో గల్లంతయిన  బోట్‌ మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ కోస్ట్‌ గార్డ్‌ సి-438, విశాఖ కోస్ట్‌ గార్డ్‌ అతుల్యతో పాటు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా బోట్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నెల 11 న ఓడలరేవు వైట్‌రిగ్‌ కి సవిూపంలో ఈ బోట్‌ ఉన్నట్టు ఆధారాలు లభించాయని, అదే కేంద్రంగా ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. బోట్‌లో జిపిఎస్‌ సిస్టం ఉన్నప్పటికీ సిగల్స్‌ అందడం లేదని బహుశా బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. చైన్నై నుంచి పారాదీప్‌ వరకు ఉన్న అన్ని ఓడల రేవుల్లోనూ బోట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశామని పేర్కొన్నారు. కోస్ట్‌ గార్డ్‌ తో పాటు మర్చెంట్‌ వెసల్స్‌ కు బోట్‌ మిస్సింగ్‌ సమాచారం అందించామని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో బోట్‌ ఆచూకీ లభిస్తుందని, మత్స్యకారులను సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

తాజావార్తలు