మత్స్యకార మహిళ నీలం అండాలు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేసి అదుకోవాలి.

తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి ):-ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ  మహంకాళి నగర్ లోని మత్స్యకార మహిళా నీలం అండాలు మృత దేహానికి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్ పూల మల వేసి  నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా మాట్లాడుతూ నీలం అండాలు  తెల్లవారుజామున లేచి 4 గంటలకు  రోజు వేళ్లే విధంగా చేపల మార్కెట్ వెళ్ళి చాపలు తెచ్చుకుని అమ్ముకుందామని ఇంట్లో బస్తాలు సదురుతుండగా ఇంట్లో అకస్మాత్తుగా అక్కడికక్కడే పడిపోవడంతో  ఉదయం తన కొడుకు వెళ్ళి చూడగా చనిపోయారని చెప్పారు.నీరు పేద కుటుంబం అయినా యాట అండాలు రోజు చాపలు అమ్ముతు వచ్చిన ఆదాయంతో జీవనం సాధిస్తున్నారని అమే చనిపోవడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.నీలం అండాలు భర్త అంజయ్య వయస్సు 62 సం,రాలు ఇద్దరు కొడుకులు ఉంటే పెద్దకొడుకు, అమె భర్త, పెద్ద కూతురు ముగ్గురు ఈ సంవత్సర కాలంలోనే చనిపోయారని పెద్ద  కొడుకుకు ఉన్న చిన్న పిల్లలను  చేసుకుంటూ ఉండేదని ఆమె కూడా చనిపోవడంతో చిన్న పిల్లలు మరింత దిన స్థితిలో పడ్డారని అన్నారు. ఉన్న చిన్న కొడుకు,కూతురు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని అన్నారు. అమే కుటుంబాన్ని ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి అదుకోవాలి,ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేసియ ఇవ్వాలని అదే విధంగా డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని చనిపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం మట్టి ఖర్చులకు తక్షణమే 50 వేల రూ,,ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కౌన్సిలర్‌ జేర్కోని బాల్ రాజు,ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్,ఇబ్రహీంపట్నం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోళ్ల సీతయ్య ముదిరాజ్,ఎలమోని రమేష్,పూజారి కుమార్,  మత్స్య మహిళా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు సోప్పరి మంగమ్మ, సొసైటీ సభ్యులు చనమోని కళామ్మ,మదాసు యాదమ్మ,యాట పద్మ,యాట బాగ్య,బోళ్ల లలిత, తదితరులు పాల్గొన్నారు.