మద్దతు ధరలతో పాటు కొనుగోళ్లపై స్పష్టత రావాలి

ఏలూరు,జూలై10(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధరల్లో మార్పులు, చేర్పులు చేసి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం రైతు విభాగం నేతలు అన్నారు. మద్దతుధరలు ప్రకటించినా పంటల కొనుగోళ్లు పూర్తిగా సాగాల్సి ఉందన్నారు. పంటల కొనుగోళ్ల విధానంలో కేంద్ర ప్రభుత్వం తగు మార్పులు చేయకపోతే రైతులకు లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడంతప్ప మరో లక్ష్యం లేకుండా సాగిందన్నారు. వైకాపా తీరు దారుణంగా ఉందని, క్రమశిక్షణ లేకపోవడంతో అరాచకంలా సాగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబంపై నిందలు వేయటం, దూషించటం వంటివే తప్ప పాదయాత్రలతో సాధించింది ఏవిూ లేదన్నారు. సంస్కార రహితంగా విమర్శలు చేసిన రోజా క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్నదాతలను ఆదుకోవాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. వైఎస్‌ హయాంలో డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి ఇచ్చిన రుణాలు కేవలం రూ. 22కోట్లేనని.. కానీ రుణమాఫీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.6,500 కోట్లు మహిళలకు ఇచ్చిందన్నారు. జగన్‌ ప్రజలకు ఏదో చేస్తానని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఓవైపు కేసులు తరుముకుని వస్తుంటే వాటినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేశారని అన్నారు.

————-