మద్దతు ధరలపై రైతుల నిత్య పోరాటం

ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): గత సీజన్‌లో మిర్చి,పత్తి, కందిరైతులకు ఎక్కడా గిట్టుబాటు ధరలు సరిగా దక్కలేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఖమ్మంలో నాఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులుఈ సందర్భంగా కోరారు. మొత్తంగా ఎక్కడా మద్దతు ధరలు దక్కలేదు. దీంతో కొనుగోళ్లపై నివేదికలు తయారు చేసి పంపనున్నారు. మద్దతు ధరలు గిట్టుబాటు కాకుండా పోయినా అమ్ముకుందామనుకున్న వారికి తక్కువ ధరలు మళ్లీ వెక్కిరించాయి. విజిలెన్స్‌ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో ఇది వెల్లడయ్యింది. ఖమ్మం జిల్లాలో వివిధ వ్యవసాయ మార్కెట్లలో గతంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మార్కెల్లో కందుల కొనుగోళ్లపై ఆరా తీశారు. ఇటీవల వరకు మార్కెట్‌ ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఎన్ని క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యాపారులు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారో వివరాలను తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాపారుల సరుకును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురు రైతులతో మాట్లాడారు. మద్దతు ధర దక్కక పోవటం గురించి రైతులు ఏకరువు పెట్టారు. ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌లు కందులు కొనుగోలు చేయకపోవటం వల్ల వ్యాపారులు మరింత ధర తగ్గిస్తున్నారని వాపోయారు.

————–