*మద్దూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు*
మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో తెల్లవారుజామున 5 గంటల నుండి 07 గంటల వరకు డీఎస్పీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని డిఎస్పి సత్యనారాయణ తెలిపారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని డిఎస్పి తెలిపారు. ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకున్నట్లయితే అట్టి విషయాన్ని పోలీసులకు సమాచారం తెలుపాలని అన్నారు. మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్గి సీఐ జనార్దన్ గౌడ్, నారాయణపేట సీఐ శ్రీకాంత్ రెడ్డి, మద్దూర్ ఎస్సై సతీష్, కోస్గి ఎస్సై నరేష్, దామరగిద్ద ఎస్సై శ్రీనివాస్, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది ప్రజలు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.