మద్యంపై నూతన ఎక్సైజ్‌ పాలసీ

ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది. గతేడాది పాలసీలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది. 6 శ్లాబ్‌ల విధానం కొనసాగించనుంది. వైన్‌షాప్‌కు పక్కన పర్మిట్‌ రూమ్‌ కావాలంటే అదనంగా రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 10 నుంచి 20 వేల జనాభా ఉంటే వైన్‌షాపు లైసెన్స్‌ ఫీజు రూ.32.50లక్షలు, 20 నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపు ఏర్పాటు చేసేందుకు రూ.34 లక్షలు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 50 వేల నుంచి 3లక్షల జనాభా ఉంటే ఫీజు రూ.42 లక్షలు, 3 నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.56 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.64 లక్షలు, 20 లక్షల పైబడి జనం ఉండే ప్రాంతాల్లో వైన్‌షాపు లైసెన్స్‌ ఫీజు రూ.1 కోటి 4 లక్షలు వసూలు చేయనుంది. బార్ల లైసెన్స్‌ ఫీజునూ ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,596 మద్యం షాపులున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
మీకండగా మేమున్నాం