మధిరలో భట్టి మాజీ కాక తప్పదు

ప్రచారంలో ఎంపి పొంగులేటి

ఖమ్మం,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఖమ్మం ముదిగొండ మండలంలో మధిర నియోజక వర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌ రాజ్‌తో కలిసి ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. భట్టి ఈసారి మాజీ కావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలను డబ్బులు పెట్టి కొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఆచరణలో సమర్థవంతంగా అమలు కావటంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని,సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వ్యవసాయానికి పాతకాలువ ద్వారా నీటిని అందించామని తెలిపారు. గ్రామాలను అన్నీ రంగాల్లో ముందుకు తీసుకొని పోవటం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రతీ గ్రామంలో జరిగిన అభివృద్ధి మరింతగా ముందుకు పోవాలంటే టీర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రజలకు కావాల్సిన వాటిని ఇవ్వటంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుందన్నారు. సాగర్‌ నీటి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా తగిన విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల విషయంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇంటిని నిర్మిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలతో మళ్లీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు. మంచి పనులు చేసే పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

గ్రామాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

/-రామాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా చేసి న ప్రయత్నాలు మరింతగా ముందుకు పోవాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మండలంలోని బూరేనిగుట్టతండా, ఒంటిగుడిసెతండా, చాఎ/-లాతండా, గోరీలపాడుతండాల్లో పర్యటించారు. కార్యక్రమాల్లో ఐడీసీ చైర్మన్‌ బుడాన్‌ బేగ్‌, సీడీసీ చైర్మన్‌ జుకూరిగోపాల్‌, మండలపార్టీ అధ్యక్షుడు బొల్లపల్లి సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి,జెడ్పీటీసీ వడ్త్యి రామచంద్రు నాయక్‌, రాష్ట్ర ఎంపీటీసీలఫోరం కార్యదర్శి ఇంటూరి శేఖర్‌, రైతు సమన్వయ సమితి నాయకులు జొన్నలగడ్డ రవికుమార్‌, మండల పార్టీ కార్యదర్శి ఆసీఫ్‌పాషా, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు

జూకూరి విజయలక్ష్మీ, వాకా సుధారాణి, మాదాసు ఉపేందర్‌రావు,కొండా మహిపాల్‌, కూరపాటి వేణు, జనార్ధన్‌, బాలాజీ, నెల్లూరి వీరభద్రం, అలీ, తండాల్లో నాయకులు పాల్గొన్నారు.