మధుయాష్కిగౌడ్ తెలంగాణ ద్రోహి
టిఆర్‌ఎస్ అర్బన్ ఇన్‌చార్జీ బస్వలక్ష్మీనర్సయ్య
నిజామాబాద్, జనవరి 31 (): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కిగౌడ్ ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని టిఆర్‌ఎస్ అర్బ న్ ఇన్‌చార్జీ బస్వలక్ష్మీనర్సయ్య దుయ్యబట్టారు. నగరంలోని తన నివాస గృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ సభ్యత్వమనేది కాగితంతో సమానమని, తెలంగాణకోసం ఎప్పు డైన రాజీనామా చేస్తానని ప్రగల్భాలు పలికిన మధుయాష్కిగౌడ్ ఈరోజు రాజీనామాపై యూటర్న్ తీసుకోవడం ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివ రించాలని డిమాండ్ చేశారు. ఐదారు రోజులుగా తెలంగాణకోసం ముగ్గురు విద్యార్థులు మళ్లీ ఆత్మబలిదానాలు చేసుకున్నారని, అయిన రాజీనామా చేయకుండా ఢిల్లీలో కూర్చిండి తెలంగాణకోసం రాజీనామా చేయ వల్సిన అవసరం లేదని, పార్లమెంటు లో ఉండి కోట్లాడుతానని పేర్కొనడం ఆయన ముర్ఖత్వానికి నిదర్శనమన్నా రు. ఒక ఎన్‌ఆర్‌ఐ అని, జిల్లా ప్రజలకు ఏదో మేలు చేస్తారని భావించి పార్ల మెంటు సభ్యునిగా గెలిపిస్తే 8సంవత్సరాలుగా ఏమి ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఒక మాట, హైదరాబాద్‌లో ఒక మాటా, ఢిల్లీలో తెలంగాణపై మరో మాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికైనా మధుయాష్కి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఆయన జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాగూర్, కిషన్, మధు తదితరులు పాల్గొన్నారు.