మధుయాష్కిగౌడ్‌ రాజీనామా చేయాలి తెలంగాణ ఎంపిలు

నిజామాబాద్‌, జనవరి 31 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణకై రాజీనామా చేయని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ దిష్టిబొమ్మను గురు వారం  ధర్నాచౌక్‌ ఎదుట తెలంగాణ జెఎసి జిల్లా నాయకులు దగ్ధం చేశా రు. ఈ సందర్భంగా టిజెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ మాట్లాడుతూ తెలంగాణ కోసం తన పదవిని రాజీనామా చేస్తానని పదేపదే చెప్పిన మధుయాష్కిగౌడ్‌, రాజీనామా చేయాలని తెలంగాణ ఎంపిలు నిర్ణయించుకోగా, యాష్కి మాత్రం రాజీనామా చేసినంత మాత్రన తెలంగాణ రాదని పార్లమెంటులో ఉండి కోట్లాడుతానని చెప్పడం సిగ్గు చేటన్నారు. గతంలో తెలంగాణ ఉద్యో గులు సకల జనుల సమ్మె చేసినప్పుడు రాజీనామా చేయడానికి వ్యతిరేకించా రని, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న రాజీనామా చేయడానికి నిరాకరించారని, తెలంగాణ అంతటా ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో కూడా తెలంగాణపై పూటకోమాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరో పించారు. తన అక్రమ వీసాల నుంచి, తన అక్రమ వ్యాపారాలను కాపాడు కోవాడానికే ఆయన తెలంగాణ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. మధుయాష్కి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని, ఆయన జిల్లా వాసి కాకపోయిన పార్లమెంటు సభ్యునిగా గెలిపించామని, కానీ ఆయన నిజామాబాద్‌ ప్రజలకు వచ్ఛించారని అన్నారు. మధుయాష్కి కాంగ్రెస్‌ అధిష్టానం కనుసన్నుల్లో మెలుగుతూ పబ్బంకడుపుకుంటున్నారని అన్నారు.  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కుడు కెవిపి రామ్‌చందర్‌రావు తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించిన మధుయాష్కి ఇప్పుడు ఈయన ఎందుకు రాజీనామా చేయడంలేదో తెలంగాణ ప్రజలకు వివరించామని అన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకుంటున్నారని, దా నికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. మధుయాష్కి కూడా ముఖ్యమంత్రితో కుమ్మ క్కయినట్లు అగుపిస్తుందని, ఆయన రాజీనామా చేయకపోతే జిల్లాలో ఎక్కడికి వెళ్లిన ఆయన పర్యటనలను అడ్డు కుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో జెఎసి నాయకులు ప్రభాకర్‌, అశానారాయణ, భాస్కర్‌, తెలంగాణ శంకర్‌, పుల్గం మోహన్‌, పిడిఎస్‌యు విద్యార్థులు ప్రగతీ, జైపాల్‌, రమాదేవి, సంగీత, దినేష్‌ తదితరులున్నారు.