మధురలో తీవ్ర హింస
– ఎస్‌పీతో సహా 24 మంది మృతి
– కొనసాగుతున్న ఉద్రిక్తత
మధుర,జూన్ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ పార్కు వద్ద చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు ఎస్పీ స్థాయి అధికారి కాగా, మరొకరు ఎస్సై కావటం గమనార్హం.మధురలోని జవహర్‌బాగ్ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.ఆక్రమణదారులు వద్ద కూడా ఆయుధాలు ఉండడంతో వారు కూడా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో లాఠీ ఛార్జి ఆపేసి బాష్పవాయు గోళాలు ప్రయోగించామని, చివరకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఆక్రమణదారుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. వారిలో ఒకరు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి, మరో సీనియర్ అధికారి ఉన్నారు. ఘర్షణల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడం, కాల్పుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మధురలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.
తప్పు పోలీసులదే: అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్‌లోని మధుర పార్కు వద్ద ఘర్షణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనలో తప్పు పోలీసులదేనని.. ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లారని ఆయన అన్నారు. పార్కులో పేలుడు పదార్థాలున్నాయన్న సంగతి తెలుసుకోలేకపోయారన్నారు.అయితే సీఎం వ్యాఖ్యలపై యూపీ పోలీస్ హెడ్ జావెద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆందోళనకారుల వద్ద ఆయుధాలున్నాయన్న సమాచారం ఉంది కానీ, కాల్పులు జరుపుతారని తాము వూహించలేదని చెప్పారు.ఉత్తరప్రదేశ్‌లోని మధుర పార్కులో చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు ఎస్పీ స్థాయి అధికారి కాగా, మరొకరు ఎస్సై కావటం గమనార్హం.మధురలోని జవహర్‌బాగ్ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఆందోళనకారుల వద్ద ఆయుధాలుండటంతో వారు కూడా పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు.
మధుర ఘర్షణపై రాజ్‌నాథ్‌గ్భ్భ్రాంతి
ఈ ఘటనపై కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌గ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే అఖిలేశ్ యాదవ్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.