మధ్యేమార్గాన్ని మించింది లేదు

సుప్రీం సీజే అల్తామస్‌ కబీర్‌
రెండేళ్లలో మరిన్ని కోర్టులు : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి):
మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌ కోర్టు ప్రాం గణంలో మీడియేషన్‌ సెంటర్‌ను శని వారంనాడు ప్రారంభించారు. అనం తరం మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల ఎందరికో మేలు జరుగుతుం దన్నారు. ఎటువంటి కేసునైనా సునాయాసంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఉచి తంగా న్యాయ సలహాలు పొందొచ్చని.. సామాన్యులకు సైతం ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం పరిష్కరించుకోవచ్చని అన్నారు.రానున్న రెండేళ్లల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వివాదాల పరిష్కారంలో కోర్టులు విశేష పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా కోర్టు బయటే వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ప్రజలకు ఒనగూరిందన్నారు. మీడియేషన్‌ కేంద్రం సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భూ వివాద కేసులను సైతం పరిష్కరించుకోవాలని సూచించారు.వివాదాల పరిష్కారంలో జాప్యం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. సామాన్యులకు ఉచితంగా న్యాయసలహాలు పొందొచ్చన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రాల వల్ల న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
బిజీబిజీగా జస్టిస్‌ అల్తమస్‌..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్‌ కబీర్‌ శనివారంనాడు మీడియేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. సిటి సివిల్‌ కోర్టు ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, న్యాయవాదులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా హైకోర్టు ప్రాంగణంలోని సెంట్రల్‌ హాలును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్‌ ప్రారంభించారు. అనంతరం జూబ్లీహాల్‌కు తరలివెళ్లారు.