మనసున్న మా ‘రాజు’
జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం
గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి
గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు
కరీంనగర్, మార్చి 24 (జనంసాక్షి):
రేటింగ్.. బ్రేకింగ్‌ల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న తెలుగు జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించడానికి ఆయన చేసిన, చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఎవరెక్కడ చస్తే మాకేంటి ముందు మా చానల్‌లో వార్త వస్తే చాలు అనుకునే జర్నలిస్టులు మనకు ప్రతినిత్యం కనిపిస్తుంటారు. ఏదైన ప్రమాదం, సంఘట నను తమకే ఎక్స్‌క్లూజివ్ అని ప్రచారం చేసుకోవడం ఒక్క తెలుగు మీడియాకే చెల్లిం ది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ నిర్వహ ణను బాధ్యతాయుతంగా చేస్తూనే మానవ త్వాన్ని చాటుకున్నాడు అల్లూరి సీతారామ రాజు. 2007 ఆగస్టు 25న కోఠికి వివిధ పనులపై వెళ్లిన వారు, ఆఫీసుల నుంచి బయటికి వస్తున్నవారు, సరదాగా చాట్ తిందామని గోకుల్‌చాట్‌కు వెళ్లిన వారిలో పలువురు ముష్కరులు పేల్చిన బాంబుల దాటికి మాంసపు ముద్దల్లా మారారు. నెత్తురోడుతున్న దేహాలతో, కొనప్రాణాలతో చేయూత కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని చూసి చలించిపోయాడు. వారిని ఎలాగైన రక్షించాలనే తపనతో రిపోర్టింగ్ చేస్తూనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్‌లో అందు బాటులో లేకపోయిన, ఆటోలు రాకపోయి నా ఆందోళన చెందలేదు. సిటీ బస్సులను ఆపి వారిని దగ్గర్లోని ఆస్ప త్రులకు తరలిం చాడు. అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను తర లించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవ డంతో తానే వారిని ఆమాంతం పైకిలేకి స్ట్రెచర్‌పై అంబు లెన్స్‌లోకి ఎక్కించారు. ఆయన అప్పుడు ఒక ప్రముఖ టీవీ చానెల్ లో పనిచేస్తున్నాడు. ఆయన చేసిన సేవను సదరు టీవీ చానెల్ ఇసుమంతైనా తన కథనాల్లో ప్రస్తావిం చలేదు. అదే సదరు చానెల్ నిర్వాహకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ పనిచేసి ఉంటే ఆకాశానికి ఎత్తేవారు. ఉద్దేశపూర్వకంగా సదరు మీడి యా యాజమాన్యం ఆయన సేవలను బాహ్య ప్రపంచం దృష్టికి రాకుండా చేసింది. జనంసాక్షి దినపత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిజంలో ఉత్తమ విలువలు పాటిస్తున్న సీతారామరాజును ఘనంగా సత్కరించింది. ప్రస్తుతం ఓ ప్రముఖ చానె ల్‌లో ప్రజెంటర్‌గా పనిచేస్తున్న ఆయనను ఆహ్వానించి అభినందించింది. శనివారం నగర శివారులోని చింతకుంటలో గల ఎడిషన్ ఆవరణలో ఆయనను గోవా లోకాయుక్త జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, జిల్లా, సెషన్స్ జడ్జిలు వి.జయసూర్య, మంగారి రాజేందర్ (జింబో), వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, జనంసాక్షి మేనేజింగ్ డైరెక్టర్ షేక్ అబూబకర్ ఖాలిద్, ఎడిటర్ ఎం.ఎం. రహమాన్, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బోయినపల్లి వెంకటరామారావు ఘనంగా సత్కరించారు. జర్నలిజంలో నైతిక విలువలు, మానవత్వం కరువైపోతున్న ప్రస్తుత తరుణంలో మనుషులుగా స్పందించేవారిని గుర్తించా లని జనంసాక్షి సంకల్పించింది. యేటా పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఒకరిని సత్కరించాలని నిర్ణయించింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ సంప్రదాయం కొనసాగిస్తామని షేక్ అబూబకర్, ఎం.ఎం. రహమాన్ ప్రకటించారు.