మన ప్రాజెక్టులపై బాబు కుట్రలు

5

– ఏపీ సీఎం లేఖ బండారం బయటపెడతా

– మంత్రి హరీశ్‌

వరంగల్‌,జూన్‌ 14(జనంసాక్షి):: తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయకత్వం అవసరామా అన్నది ఇక్కడి నేతలు ఆలోచన చేయాలని మంత్రి హఝీరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడుకూడా తన కుట్రలను ఆపడం లేదన్నారు. ఇక్కడి నేతలతో మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని అన్నారు. త్వరలోనే బాబు లేఖలను బయటపపెడతామని అన్నారు. వరంగల్‌ జిల్లా  హన్మకొండ మండలం కడిపికొండలో మంత్రి హఝీరావు మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చంద్రబాబు స్వయంగా లేఖ రాశారా లేదా అని అన్నారు. ప్రాజెచ్టీ పనులను అడ్డుకోవాలని రాసారని అన్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఇంకా బాబు పెత్తనం ఏంటని అన్నారు. మనం గోదావరి జలాలను  తీసుకుని రావాలని చూస్తుంటే ఆయనేమో అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రాజెచ్టీలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్‌కు చంద్రబాబు లేఖ రాశారని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. కేబినేట్‌లో తీర్మానం, ఉమాభారతికి లేఖలు రాశారా లేదా అని అన్నారు. రాయచూం కలెక్టంకు లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లేఖ రాయలేదంటే తాము ఆ లేఖను బయటపెడతామని మంత్రి పేర్కొన్నారు. డిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెచ్టీలు పాతవేనని, తెలంగాణలో కొత్త ప్రాజెచ్టీలేవీ చేపట్టలేదని మంత్రి హరీష్‌రావు వివరించారు. బాబు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే కార్యక్రమం పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రాజెక్టులకు ఇంకా బాబు అనుమతి కావాలా అని అన్నారు. ఇక్కడి ప్రజల సంక్షేమం,అవసరం కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెచ్టీను చేపట్టామని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖ రాసింది నిజమా? కాదో ఆంధ్రప్రదేa ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని మంత్రి హఝీరావు డిమాాం చేశారు. లేని పక్షంలో చంద్రబాబు రాసిన లేఖను బయటపెడతామని ఆయన  సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కావని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులనే ఇప్పుడు కడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలంటే తెలంగాణ ప్రజల అనుమతులు కావాలే తప్ప.. పక్క రాష్ట్రాల వారి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పేరు మారుమోగుతుందని… మిషన్‌ కాకతీయ పేరు పెట్టి ఓరుగల్లు పేరును ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం కేసీఆంకే దక్కుతుందని అన్నారు.  సిద్ధేశ్వరం చెరువుకు రూ.50లక్షలు మంజూరు చేయనున్నట్టు మంత్రి హఝీరావు ఈ సందర్భంగా తెలిపారు. ఇవాళ హన్మకొండ మండలం కడిపికొండలో మంత్రి మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌ జిల్లాలో చెరువుల పునరుద్దరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అవన్నారు. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతులకు రూ.5కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆకేరువాగుపై శిథిలమైన చెచీడ్యాంల స్థానంలో కొత్త చెచీ డ్యాంలను నిర్మించనున్నట్టు తెలిపారు. కాగా, బ్రిజేష్‌ కుమాం ట్రైబ్యునల్‌ అవార్డు వెలువడకుండా ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఒప్పుకునేది లేదని మంత్రి హఝీరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈనెల 21న ఢిల్లీలో జరిగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆంఎంబీ) సమావేశంలో చెబుతామన్నారు. ఇప్పటికే కృష్ణా నదీ జలాల పంపకంపై బ్రిజేష్‌ కుమాం ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ రాష్ట్రం వాదనలు వినిపిస్తోందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశకు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఆంధ్రకు 512 టీఎంసీల నీటిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా సర్దుబాటు చేసిందన్నారు. శాశ్వత ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బ్రిజేష్‌ కుమాం ట్రైబ్యునల్‌ తీర్పు వెలువడితేనే ఏ రాష్ట్రానికి  ఎంత నీటిని కేటాయించారన్న విషయంపై స్పష్టత వస్తుందన్నారు. అయితే, 299 టీఎంసీలకు అదనంగా మరో 90 టీఎంసీలను  రాష్ట్రానికి  కేటాయించాలని కోరనున్నామన్నారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని, ఇక్కడి ప్రజల ఉసురు తీయొద్దని మంత్రి హఝీరావు కోరారు.జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారని, గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. గతంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు వర్గాలుగా చీలిపోయి, స్వార్థపూరిత రాజకీయలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో చేయలేని పనులను తాము రెండేళ్లలోనే పుర్తి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికే 123 జీఓ ఉపయోగపడుతుందని, ఇందులో బలవంతపు భూసేకరణకు ఆస్కారం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయ ప్రయోజనం పొందడానికే ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన పరిహారం కంటే తాము ఇస్తున్నది ఎక్కువగా ఉందన్నారు. పాలమూరులోని పెండింస్త్ర ప్రాజెక్టుల పూర్తికి వెయ్యి కోట్లు ఇస్తే సరిపోతుందని ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని, అయితే తాము ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు కోసమే ఇప్పటివరకు రూ.1,600 కోట్లు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అంచనా వ్యయం రూ.2,190 కోట్లు కాగా, ఇప్పుడది రూ.4,600 కోట్లకు చేరుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కేటాయించిన ఘనత టీఆంఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయం నరేందంతోపాటు ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కం, ఆరూరి రమేa, టీఆంఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.