మభ్యపెట్టే మాటలు, పథకాలు మానాలి

ప్రజలకు మేలు చేయకుంటే వాతలు పెడతారు
పిసిసి చీఫ్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా
కాంగ్రెస్‌ దండోరాతో అధికార పార్టీలో వణుకు : షబ్బీర్‌ అలీ
కామారెడ్డి,ఆగస్ట్‌12(జనం సాక్షి): కాంగ్రెస్‌ హయాంలోనే దళిత, గిరిజనులకు న్యాయం జరిగిందని
మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. మభ్య పెట్టే పథకాలతో కెసిఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హుజారాబాద్‌ ఉప ఎన్నిక రాగానే దళితబంధు గుర్తుకు వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఇచ్చిన మూడెకరాల హావిూ మూలకు పడిరదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో దళిత, గిరిజనులకు ఎలాంటి లబ్దిచేకూర్చలేదన్నారు. గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులు కూడా బెంబేలెత్తి విమర్శించడం తగదని కాంగ్రెస్‌ నేత అన్నారు. ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభ అనంతరం టీఆర్‌ఎస్‌లో భయం పుట్టిందన్నారు. తమ నాయకుడిని విమర్శించే స్థాయి విూది కాదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. అమలు కాని హావిూలతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించి న సోనియాగాంధి తెలంగాణ ప్రత్యేక రాష్టాన్న్రి ఇచ్చిందని షబ్బీర్‌ తెలిపారు. అట్లాంటి కాంగ్రెస్‌ పార్టీపై, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకు ండా రోడ్లపై తిరిగేలా చేస్తున్నారని మండిపడ్డా రు. ఇంటికో ఉద్యోగమని ఏడు సంవత్సరాల పాలనలో కేవలం 28వేల ఉద్యోగాలను మాత్రం భర్తీ చేసిందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వేలాది నిరుద్యోగ యువకులు ఉన్నారని తెలిపారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లిలో మాట్లాడిన మాటలకు మంత్రుల్లో వణుకు మొదలైందని వాస్తవాలను మాట్లాడితే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేసేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసేందేమి లేదని తెలిపారు. ఇప్పటికేనా కెసిఆర్‌ ప్రజలకు మేలు చేసే విధానాలు ఆలోచించాలన్నారు. మభ్య పెట్టే ప్రకటనలు చేస్తే ప్రజలు తప్పకుండా వాతలు పెడతారని షబ్బీర్‌ హెచ్చరించారు.