మరణించినా… నేత్ర దానం చేసి ఇద్దరు జీవితాలలో వెలుగు నిద్దాం
ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):- MGM వరంగల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ పత్తి మల్లయ్య(45) గుండె పోటు తో మరణించగా కుటుంబసభ్యులు భార్య-కమా, కుమారుడు- శివ, కూతురు,అళ్లుడు సహకారంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అర్బన్ అధ్యక్షుడు మల్లారెడ్డికి సమాచారం ఇవ్వగా, నేత్ర సేకరణ నిపుణులు లక్ష్మణ్ ద్వారా కార్నియా సేకరణ చేయనైనది, మ్రుతుడు మల్లయ్య పులుకుర్తి గ్రామం దామర మండలము, హన్మకొండ జిల్లాకు చెందినవాడు, కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెల్పి నేత్ర దాన సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది, నేత్రదానంపై అందరం అవగాహన కలిగి ఉండాలని దీనిని సామాజిక బాధ్యతగా భావించాలని అధ్యక్షులు కోరినారు. అదే విధంగా అసోసియేషన్ సభ్యులు
ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శంకర్ రావు యాదవ్, సలహాదారులు ఎ రాజేంద్రప్రసాద్ ,సంయుక్త కార్యదర్శి కేదారి అభినందనలు తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే 9703738699,, 8790548706. ఈ ఫోన్ నెంబర్ కు సమాచారాన్ని ఇవ్వగలరు అని కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు దిలీప్ , కిషోర్ , సంతోష్ , రాజకుమార్, కుమార్ పాల్గొన్నారు.