మరోమారు అమెరికాలో కాల్పుల కలకలం

గన్‌మెన్‌తో సహా నలుగురు మృతి
అప్రమత్తమై దుండగుడి కాల్చవేత

న్యూయార్క్‌,జూలై18(జనంసాక్షి): మరోసారి కాల్పులతో అమెరికా దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్‌లోని ఫుడ్‌ కోర్డులో దుండగుడు కాల్పులు జరిపాడు. రైఫిల్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో గన్‌మెన్‌తో సహా నలుగురు మృతి చెందగా… ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మరో వ్యక్తి దుండగుడిపై కాల్పులు జరిపాడని..అతను కూడా మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు కాల్పులపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. బాత్రూమ్‌?లో అనుమానాస్పదంగా బ్యాగ్‌ కనిపించినట్లు వెల్లడిరచారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గన్‌ వయొలెన్స్‌ ఆర్కివ్‌ నివేదిక ప్రకారం అమెరికాలో కాల్పుల వల్ల ఏడాదికి 40వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 4న కూడా చికాగోలో ఓ దుండ గుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయాల పాలయ్యారు. మరోవైపు అమెరికాలో కాల్పుల ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో గన్‌ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. దీని ప్రకారం 18`21 ఏళ్ల మధ్య వయసున్న వారు గన్స్‌ కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలగదని ప్రజల రక్షణ కోసమే చట్టాన్ని తీసుకువస్తున్నట్లు బైడెన్‌ చెప్పారు. అయితే ఫుడ్‌ కోర్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని మరికొందరు చెబుతున్నారు. సాయుధ పౌరుడు జరిపిన ఎదురుకాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడని అమెరికా పోలీసులు తెలిపారు. గ్రీన్‌వుడ్‌ పార్క్‌ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన ఇద్దరిని సవిూపంలోని ఆసుపత్రికి తరలించినట్లు గ్రీన్‌వుడ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ జిమ్‌ ఐసన్‌ తెలిపారు.గ్రీన్‌వుడ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ శాంతిభద్రతలను పరిరక్షిస్తోంది. కమాండ్‌ పోస్ట్‌తో నేరుగా సంప్రదింపులు జరుపు తున్నాను, ఇక ఎలాంటి ముప్పు లేదని మేయర్‌ మార్క్‌ మైయర్స్‌ చెప్పారు. అయితే కాల్పుల వెనుక కారణమేమిటనేది ఇంకా కనుగొనలేదు. స్థానిక అత్యవసర కాల్‌ సెంటర్‌కు ఆదివారం రాత్రి ఫుడ్‌ కోర్ట్‌లో కాల్పుల గురించి సమాచారం వచ్చిందని పోలీసులు చెప్పారు.కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద పొడవాటి రైఫిల్‌, మందుగుండు సామగ్రికి సంబంధించిన అనేక మ్యాగజైన్లు ఉన్నాయని పోలీసు చీఫ్‌ జిమ్‌ ఐసన్‌ తెలిపారు.

తాజావార్తలు