మరోమారు తడిసిపోయిన ధాన్యం

తడిసిన ధాన్యంతో రైతుల దౌన్యం
ఆదిలాబాద్‌,మే28(జ‌నం సాక్షి): మరోమారు అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. ఎన్ని జాగ్రత్తుల తీసుకునా నస్టాలు తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన అకావ వర్షం వల్ల భారీగా నష్టం జరిగిందని అంటున్నారు. గ్రామాల్లో కురిసిన వానకు పంట పొలాలు జలమయమయ్యాయి. ఒర్రెలు, చిన్నవాగులు వరద నీటితో నిండుగా పారాయి. వర్షం వస్తుందని తేరుకున్న రైతులు ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు పరుగులు పెట్టారు.ఆయా గ్రామాలలో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారు వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దవగా, చెట్లు విరిగి పడి ఆదివారం మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లే తమ పంట వర్షం పాలైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ముమ్మరంగా కొనుగోళ్లు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం తేమ పేరిట జాప్యం చేయడం రైతాంగానికి శాపంగా మారింది. అనేక గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయ్యింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జరిగిన నష్టానికి అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గాలుల వల్ల ఆయా జిల్లాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.. గాలి తీవ్రతకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలపై పడిపోవడంతో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో మంచిర్యాల నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి.  ఉమ్మడి జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు 200కు పైగా విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. అనేక చోట్ల విద్యుత్తు తీగలు పడిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.  స్తంభాలు పడిపోగా, తేరుకున్న సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.  జిల్లాలో పడిపోయిన విద్యుత్తు స్తంభాలను బాగు చేయడంతో పాటు తీగలను సరిచేసి మధ్యాహ్నంలోగా పట్టణంలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు.
—-

తాజావార్తలు