మరోమారు స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్‌పై 15పైసలు తగ్గించిన చమురు కంపెనీలు

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి): వరుసగా ఆరో రోజు పెట్రోల్‌ ధర తగ్గింది. అయితే గత ఐదు రోజుల మాదిరిగానే సోమవారం కూడా తగ్గింపు స్వల్పంగానే ఉంది. వెక్కిరించినట్లుగా తగ్గింపులు కొనసాగుఉతన్నాయి. మరోవైపు ఆదివారం స్థిరంగా ఉన్న డీజిల్‌ ధర కాస్త తగ్గింది. సోమవారం పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 77.96గా ఉంది. ముంబయిలో ఇది రూ. 85.77, కోల్‌కతాలో రూ. 80.60, చెన్నైలో రూ. 80.94గా ఉంది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ. 68.97, ముంబయిలో రూ. 73.43 కోల్‌కతాలో రూ. 71.52, చెన్నైలో రూ. 72.82గా ఉంది. గత ఆరు రోజుల్లో పెట్రోల్‌పై 47 పైసలు, డీజిల్‌పై 34 పైసలు తగ్గింది. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. మే 14 నుంచి వరుసగా 16 రోజుల పాటు చమురు ధరలు పెరిగాయి. ఈ కాలంలో పెట్రోల్‌ ధర లీటర్‌పై రూ. 3.80, డీజిల్‌ ధర లీటర్‌పై రూ. 3.38 వరకు పెరగడం గమనార్హం.