మర్పడగ మల్లికార్జున క్షేత్రంలో అద్భుత దృశ్యం

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 22 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని మర్పడగా  గ్రామంలోని శ్రీ విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శనివారం సుప్రభాత సమయంలో ఒక అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు అర్ధమండపం లోని నందీశ్వరుడి తలమీదుగా గర్భగుడిలోని సంతాన మల్లికార్జున స్వామి పై ప్రసారించాయి. నందీశ్వరుడు తల ఆలయంలోని శివలింగాలు స్వర్ణకాంతులతో తలుక్కుమన్నాయి. సుప్రభాత వేళ ఆలయం తెరిచిన అర్చకులకు , భక్తులకు కనిపించిన ఈ దృశ్యం పరవశ్యానికి గురిచేసింది. అర్థ మండపం, మహా మండపం, బయట రేకుల షెడ్డు, మహానంది మండపం వీటన్నింటిని దాటుకుని నునులేత సూర్యకిరణాలు గర్భాలయంలోని సంతానం మల్లికార్జున స్వామిని అభిషేకించడం అలనాటి శిల్పుల చాతుర్యానికి నిదర్శనమే కాకుండా స్వామి మహిమకు నిదర్శనమని భక్తులు చెపుతున్నారు .