మల్లెందొడ్డిలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
మల్దకల్ సెప్టెంబర్17(జనం సాక్షి)మల్ధకల్ మండలంఎల్కూరు గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖ ఆధ్వర్యములో
మల్లేందొడ్డి గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించడం
జరిగింది. ఈ సమావేశములో బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకులో
ఉన్న డిపాజిట్ ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్ల గురించి వివరించారు.బ్యాంకులో రైతులు తీసుకున్న రుణాలు సకాలములో అంటే సంవత్సరము
లోపల తిరిగి చెల్లించిన వారికి, రైతులకు 3%
వారి ఖాతాకు కేంద్ర ప్రభుత్వము
ఇస్తుంది కాబట్టి ఇట్టి సదుపాయాన్ని రైతులందరు లబ్దిపొందాలని రైతులను కోరారు.అంతే కాకుండా డిపాజిట్లు కూడా స్వీకరిస్తుందని
డిపాజిట్లు చేసి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామీణ బ్యాంకులో ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే డిపాజట్లు పై అధికంగా పావలా వడ్డీ చెల్లిస్తున్నది అన్నారు.అప్పులు ఇవ్వడమే కాకుండా
బ్యాంకు లో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్,ప్రధానమంత్రి ప్రమాద బీమా, అటల్ పెన్షన్ తదితర సెక్యూరిటీ పథకాలలో చేరి లబ్ధి పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,ఫీల్డ్ ఆఫీసర్ వేణు తేజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాణిక్య రెడ్డి, ఖాతాదారులు,రైతులు పాల్గొన్నారు.
Attachments area