మళ్లీ ఉత్తరాఖండ్ సీఎంగా రావత్
– కెబినెట్ నిర్ణయం
డెహ్రాడూన్,మే12(జనంసాక్షి): ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం ముగిసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హరీష్ రావత్ ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం దక్కిన సంగతి తెలసిందే.దీంతో నిన్న రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు. నేటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని రావత్ ఆదేశించారు. గతంలో జారీ చేసిన జీవోలన్నీ వెంటనే అమలు చేయాలని మంత్రులకు సూచించారు. కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉండగా అది రద్దైంది.