మళ్లీ పత్తివైపే రైతుల మొగ్గు
ఆదిలాబాద్,జూన్26(జనం సాక్షి): వ్యవసాయా అధికారుల సూచనలను పాటించకుండా రైతులు మళ్లీ పత్తివైపే అత్యధికంగా మొగ్గు చూసుతున్నారు. గతంలో కంది, మిర్చి వేయాలన్న సూచనలు పాటించి మోసోయామని, కనీస పెట్టుబడులు కూడా దక్కకండా చేశారని మండిపడుతున్నారు. మార్కెట్లో పత్తికి మద్దతు ధర ఉండంతో పాటు దిగుబడి అధికంగా రావడంతో అన్నదాతలు పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది రైతులు అధికంగా కంది పంటను సాగు చేశారు. పంట దిగుబడి ఉన్న మార్కెట్లో మద్దతు ధర లేక రైతులు ఈ ఏడాది అధికంగా సాగు చేయడం లేదు. వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషంగా పత్తి విత్తనాలు వేశారు. పత్తి పంట సాగు చేసేందుకు రైతులు ఎకరాకు రూ.15వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సీజన్‌లో పత్తి క్వింటాలుకు మార్కెట్లో రూ.4500 వరకు ధర పలికింది. గతంలో పత్తి వేసిన రైతులు నీటిపారుదల సౌకర్యం ఉన్న వారు జొన్న పంటను సాగు చేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. ల్గ/తులు పత్తి పంటను అధికంగా వర్షధారంగా సాగు చేస్తున్నారు. గతంలో జొన్న, పెసరి, మినుము, కంది పంటలు సాగు చేసే రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. పత్తి అమ్మకాలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగాపత్తి పంటలో కందిని సాగు చేస్తారు. పత్తి విత్తనాలు వేసేందుకు అనుకూలంగా వర్షాలు కురవడంతో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. విత్తనాలు వేసేందుకు ముందుగానే రైతులు డీఏపీ, యూరియా, పోటాష్ ఎరువులు భూమిలో వేశారు. వర్షాలు పడడంతో విత్తనాలు వేయడంతో పాటు వానలు పండంతో మొక్కలు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వాతావరణం పత్తి పంటకు అనుకూలంగా ఉండడంతో కలుపు తీసి ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధంగా కావడం జరుగుతుంది. కంది,మిర్చి,సోయా పంటల కారణంగా నస్టపోయామని అన్నారు.