మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,మే25(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఆగడం లేదు. వరుసగా 12వ రోజైన శుక్రవారంనాడు కూడా ధరలు పైపైకి ఎగిశాయి. లీటర్‌ పెట్రోల్‌ 32 పైసలు, డీజిల్‌ 18 పైసలు చొప్పున పెరిగింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు ధరలు పెంచకుండా స్తబ్దుగా ఉన్న చమురు సంస్థలు ఆ తర్వాత విజృంభిస్తూ వస్తాయి. కేంద్రం చేష్టలుడిగి చూస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని వినియోగదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటికి వరకూ పెట్రోల్‌ ధరలు రూ.11 రూపాయల మేరకు పెరిగాయి. డీజిల్‌ ధర రూ.7.27కు పెరిగింది. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.77.83కు చేరుకోగా, ముంబైలో రూ.73.20కు, చెన్నైలో రూ.81కి చేరింది. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంతకుముందు చెప్పినప్పటకీ ఇంకా వినియోగదారుడికి ఎలాంటి ఊరట దొరకలేదు.