మళ్లీ విజృంభిస్తున్న కరోనా డెల్టా
కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే
ఒక్కరోజులోనే ప్రపంచంలో 7లక్షల కొత్త కేసుల నమోదు
న్యూఢల్లీి,ఆగస్ట్7(జనంసాక్షి): అమెరికాలో వ్యాక్సిన్ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇలానే ఇన్ఫెక్షన్లు పెరిగితే దాని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, కరోనా వేరియంట్ల కారణంగా మహమ్మారి మరితంత తీవ్రరూపం దాలిస్తే దానిని ఎదుర్కొనడం మరింత కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో పాటు ఇండియా, చైనా దేశాల్లో కేసులు మరలా పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజులోనే ప్రపంచం మొత్తంవిూద 7 లక్షల కేసులు నమోదయ్యాయి. మే 14 వ తేదీ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇండోనేషియాలో రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ ప్రస్తుం 135 కి పైగా దేశాల్లో వ్యాపించింది. 2019 డిసెంబర్ నుంచి ప్రపంచం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచం మొత్తం
ఆందోళన చెందుతోంది. కొన్ని దేశాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు విడతలుగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజుకో కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. అటు అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్యంగా కొత్త పాజిటివ్ కేసులు పెరుగాయి. కోవిడ్ పుట్టినిల్లు చైనాలోనూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ’వరల్డ్ విూటర్’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా వ్యాపించే శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండొనేసియాలో మరణాలు పెరుగుతున్నాయి. అటు, అమెరికా మరోసారి కరోనా రాకాసి కోరలకు విలవిలలాడుతోంది. తొలి విడతలో కల్లోలం చూసిన అగ్రరాజ్యం.. గత 3 రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. డెల్టా రకం వ్యాప్తి పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఆసుపత్రుల పాలవుతున్న బాధితుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ’సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ సమాచారం మేరకు ఈ సంఖ్య సగటును 12 వేల నుంచి 43 వేలకు పెరిగింది. దేశవ్యాప్తంగా 1.20 లక్షల మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. అత్యధికంగా ప్లోరిడాలో 20 వేలకు పైగా కొత్త కేసులు బయట పడగా.. టెక్సాస్, కాలిఫోర్నియాల్లో ఈ సంఖ్య 10 వేలు దాటింది. అమెరికాలో ఫిబ్రవరి రెండో వారం తర్వాత మళ్లీ ఈ వారంలోనే రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఆసుపత్రుల పాలవుతు న్నవారిలో ప్లోరిడా, జార్జియా, లూసియానాల్లోనే 40 శాతం మంది ఉన్నారు. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. స్థానిక వ్యాప్తి ద్వారా శుక్రవారం 80 మంది కోవిడ్ బారిన పడ్డారని స్థానిక విూడియా పేర్కొంది. వీటిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్‌రaౌ నగరంలోనే నమోదయ్యాయి. ఇక్కడ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉందని, మరో 6 ప్రావిన్సుల్లో మిగతా కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే, చైనాలో గత ఏడాది కోవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. తాజా ఉద్ధృతి నాన్‌జింగ్ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో కరోనా వ్యాప్తి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు కొద్ది రోజులుగా బయటపడిన కేసుల సంఖ్య 1,200 దాటింది. దీంతో చైనా ప్రభుత్వం మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్‌జింగ్ సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు, అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. ఇక, బ్రెజిల్ దేశంలోనూ రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గురువారం 24 గంటల్లో 40 వేల మందికి పైగా కొవిడ్ బారిన పడగా.. 1,086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండొనేసియాలో 1,700 మందికి పైగా మృతి చెందారు. రోజువారీ కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్‌లోనూ ఒక్క రోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో తాజాగా 30,215 మందికి కొవిడ్ సోకింది. రష్యా, టర్కీ, ఫ్రాన్స్, మెక్సికోల్లోనూ 20 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. దీనికి నివారణగగా కఠిన ఆంక్షలు పాటించడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చిరంచింది. జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు మరింత ప్రమాదకరంగా పెరుగుతాయని తెలిపింది.