మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

గద్వాల డిఎస్పి ఎన్.సిహెచ్ రంగస్వామి.

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 9 (జనం సాక్షి);
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని గద్వాల డిఎస్పి ఎన్.సిహెచ్ రంగస్వామి పిలుపునిచ్చారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం గద్వాల పట్టణంలోని డి.ఎస్.పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో పలువురి ఇతర అధికారులు తో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఆనంతరం గద్వాల డిఎస్పి ఎన్.సిహెచ్ రంగస్వామిమాట్లాడుతూ
వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని డీఎస్పీ పేర్కొన్నారు.వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని డీఎస్పీ తెలిపారు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడిబడి ఉందని డిఎస్పి రంగస్వామితెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు జగదీష్,
కృష్ణ,రజిత,తదితరులు పాల్గొన్నారు.