మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులతో కేసీఆర్‌ సమీక్ష

మహబూబ్‌నగర్‌: జిల్లాలో తాగునీరు, విద్యుత్తు, జూరాల ప్రాజెక్టు కింద రబీ పంటలకు సాగునీరు… తదిదర అంశాలపై మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు కేమీక్ష నిర్వహించారు. తన లోక్‌సభ స్థానం పరిధిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎంపీ నిధుల నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.15లక్షల నుంచి 25 లక్షల వరకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాలమూరు పురపాలకంలో రామన్‌పాడు మంచినీరు అందని ప్రాంతాలు, పైపులైను లీకేజీ, ఇతర సమస్యల వల్ల తాగునీరు రాని వార్డులను గుర్తించి బోర్లను, మోటార్లను వేయించాలని అధికారులను కోరారు. జిల్లాలో చదువుకున్న యువతకు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతి నియోజకవర్గానికి కొంత మొత్తాన్ని కేటాయించాలని కలెక్టర్‌ కోరగా తన నిధుల నుంచి రూ.50లక్షలు కేటాయిస్తానన్నారు. జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ భవన నిర్మాణానికి రూ.60లక్షలు కేటాయించారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ ఎం. గిరిజా శంకర్‌, జేసీ ఎల్‌.శర్మన్‌ , కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి , మాజీ రాజ్యసభ సభ్యులు రాంచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి… తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు