*మహర్షి వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలి*

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నది గడ్డ, అక్టోబర్ 9 (జనం సాక్షి);
మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడు అని నిరూపించిన మహర్షి వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు పుట్టిన మన పండితుల గడప నందు జన్మించిన మహర్షి వాల్మీకి గొప్ప సాంస్కృత ఆదికవిగా గుర్తించబడి,మానవ సమాజానికి అందించిన అపురూపమైన కానుక రామాయణ మహా గ్రందమన్నారు.పూజనీయ రామాయణ మానవ విలువలు, మానవ సంబంధ బాంధ వ్యములు,
ప్రవర్తన విధానములు మనందరికి అందించారని
 అన్నారు.వాల్మీకి పేద కుటుంబములో
పుట్టినటువంటి పుణ్య పురుషుని జయంతిని
ప్రభుత్వము అధికారికంగా జరుపడం హర్షణీయమన్నారు .ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడగు జాడలలో నడవాలని
ఆశిస్తూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో వెనుక బడిన తరగతుల శాఖ అధికారిని శ్వేతా ప్రియదర్శిని,డి పి ఆర్ ఓ చెన్నమ్మ,ఎ ఓ యాదగిరి, సూపరింటెండెంట్ మదన్మోహన్,బలరాం,హఫీజ్, శ్రీనివాస్ కార్యలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.