మహాకూటమిని తిప్పికొట్లాలి
అధికారం కోసమే బాబుతో కాంగ్రెస్ మిలాఖత్: నిరంజన్
వనపర్తి,నవంబర్26(జనంసాక్షి): దొంగలంతా కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా తగిన బుద్ధి చెప్పాలని వనపర్తి టిఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటాలని అన్నారు.కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుకు అమ్ముడు పోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణలో ఎదురులేదని, టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రేసోళ్ల మాటలు, చేతలకు అర్థాలు ఉండవన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎలాంటి జిమ్మిక్కులైనా చేస్తారని విమర్శించారు. 1969లో తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలకు కారకులైన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సభలో ఆంధ్రోళ్లకు ప్రత్యేక ¬దా ఇస్తామనడం ఎంత వరకు సమంజసమో చెప్పాలన్నారు. బీసీలకు టీఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చరిత్రలో బీసీలకు రాజకీయంగా ఏనాడు పదవులు ఇవ్వలేదని
ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్లీ అమరావతిలో తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ జతకట్టాయని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వం.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అని చెప్పిన సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వంతపాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పడుఉ చ ం ద్రబాబుతోనూ జతకట్టారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ అక్రమ పొత్తులు, కూటమి ఎత్తులు, జిత్తులను ప్రజలు తిప్పకొట్టడం ఖాయమని హెచ్చరించారు. మహాకూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు. టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.