మహానుభావుల కృషితో దేశ నిర్మాణం జరిగింది
ప్రభుత్వాలు దేశాన్ని నిర్మించలేవు
పేదరికంపై యుద్ధం, స్వచ్ఛభారత్‌కు కృషి
ప్రభుత్వ లక్ష్యాలు రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): ఈ దేశాన్ని ఎప్పుడో మహామహులు, సంతులు,సాధువులు, మహానుభావులు నిర్మించారని, ప్రభుత్వాలన్నవి వస్తుంటాయి పోతుంటాయని ప్రధాని మోడీ అన్నారు. మంచికోసంప్రయత్నంచేయడం, మంచిపాలన అందించడం కోసం నిరంతరం గాపోరాడుతామని అన్నారు. తామే మంచిచేశామన్న అహం పనికారాదన్నారు. భారత్‌లో మతహింస ఎవరు ఎవరివిూద చేస్తారన్నది ఏనాటికీ విషయం కాదన్నారు. ప్రవాలు దేశాన్ని నిర్మించలేవన్నారు.. హిందూ, ముస్లింలు అందరూ కలిసి పేదరికంపై యుద్ధం చేయాలని ప్రధాని మోడీ సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నదే భారతీయ జీవన అంతఃసూత్రమని చెప్పారు. అన్ని మతాలు, సిద్ధాంతాలు చెప్పేదొక్కటేనని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే దేశంలో పరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఏ వ్యక్తికి, మతానికి లేదని స్పష్టం చేశారు. ఇండియా ఫస్ట్ అన్నదే తమ మతం.. సత్యం ఒక్కటే అన్నదే తమ సిద్ధాంతం.. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ మాట్లాడారు. సమస్యలు ద్వారానే చర్చలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను రాష్ట్రపతి ప్రసంగంలో వివరించిన సంగతిని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ్ భారత్ పై అందరూ మాట్లాడుతున్నారు, దేశంలో అపరిశుభ్రత కూడా సమస్యే అని మోదీ తెలిపారు. ‘మన దేశ మూల సూత్రం సర్వేజనా సుఖినోభవంతు. దేశానికి ప్రజల శక్తి సామర్ధ్యాలే ముఖ్యం. అవినీతి వల్లే దేశం భ్రష్టు పట్టిపోయింది. అవినీతి మహ్మమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలి’ అని మోదీ తెలిపారు.ఇప్పటికీ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం విచారకరమన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా బాలికలు బడి మానేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని గమనించే తమ ప్రభుత్వం స్వచ్ఛభారత్‌కు పిలుపునిచ్చిందని చెప్పారు. పథకాల పేర్ల మార్పు సమస్య కాదని, ప్రభుత్వ పథకాల అమలు తీరే ప్రధానమన్నారు. గ్రామాల్లో బహిర్భుమికి వెళ్లాలంటే మహిళలు ఇబ్బంది పడుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ను కార్యక్రమాన్ని వాజ్‌పేయి హయాంలోనే చేపట్టారని గుర్తు చేశారు. స్వచ్ఛభారత్‌ను కేంద్రీకరించాలి. దేశంలో అపరిశుభ్రత కూడా ప్రధాన సమస్యే అని అన్నారు. ఈ విషయం ప్రపంచబ్యాంకు నివేదికలోనూ వెల్లడైందని గుర్తు చేశారు. తనను విూడియా ప్రతినిధులు కలిశారు.. తాము కూడా స్వచ్ఛభారత్‌కు సహకరిస్తామని చెప్పినట్లు మోడీ తెలిపారు.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రాధ్యమాలను రాష్ట్రపతి ప్రసంగంలో వివరించారని అన్నారు. అవినీతి మహమ్మారి నుంచి దేశాన్ని బయటపడేయాలని సూచించారు. చరిత్ర ప్రతి పదానికి సాక్షి, అందుకే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని చెప్పారు. గత 9 నెలల్లో తాము ఏం చేయాలో అది చేశాం.. కానీ చెప్పుకోవాల్సిన పని లేదన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా మూడేళ్లుగా నల్లధనంపై సిట్ వేయలేదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తాము అధికారంలోని రాగానే దీనిపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశాభివృద్ధి తమ లక్ష్యం.. అంతిమ విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలం ద్వారా లక్ష కోట్లు సవిూకరించామని తెలిపారు.
భూసేకరణపై రాజకీయాలా..?
భూసేకరణ బిల్లు పై రాజకీయం చేయొద్దు అని విపక్షాలకు మోడీ సూచించారు. యూపీఏ తెచ్చిన భూసేకరణ బిల్లులో లోపాలు లేకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది, మేం ఏం చేస్తే అదే మంచిదనే అహంకారం ఉండొద్దు. మేం పేదల కోసం పని చేస్తాం. పేదల విూద రాజకీయాలు చేయం. రైతుల శ్రేయస్సు కోసమే భూ సేకరణ చట్టంలో మార్పులు చేసాం. భూసేకరణ బిల్లు పై రాజకీయం చేయొద్దు, గత ప్రభుత్వాల తప్పులను సరిచేస్తాం’ అని ప్రధాని అన్నారు.భూసేకరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతోందని ప్రధాని మోడీ తెలిపారు. తాము ఒక పని చేశాం, ప్రపంచంలో ఇంతకంటే ఎవరూ చేయలేరనే అహంకారం ఉండకూడదని సూచించారు. 1894 నాటి భూసేకరణ చట్టంలో మార్పులు చేయడానికి 2013 వరకు 120 సంవత్సరాల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరుగుతుందని ఇంతకాలం అధికారంలో ఉన్నవారికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఇవాళ చట్టంలో మార్పులు చేయకూడదంటూ రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. యూపీఏ విధానాలు, చేసిన చట్టాలు మంచివైతే ప్రజలెందుకు ఓడించారు అని అడిగారు. పశ్చిమ భారతంలోని గ్రామాల్లో ఎంతో కొంత మౌలిక సదుపాయాలున్నాయి.. కానీ తూర్పు భారతంలో కనీస సౌకర్యాలు లేని రాష్టాల్రు ఎన్నో ఉన్నాయని తెలిపారు. భూసేకరణ లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదని స్పష్టం చేశారు. బిల్లులో ఇబ్బందులు, సమస్యలు ఏమైనా ఉంటే రండి.. కలిసి చర్చిద్దాం, మార్పులు చేద్దామని పిలుపునిచ్చారు. భూసేకరణ చట్టం ఏర్పాటు చేసిన గౌరవం వాళ్లకే ఇద్దామన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ అన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి చెందిన రాష్టాల్రతో సరిసమానంగా మనం ఈ రాష్టాల్రను చూడాలని తెలిపారు.
వ్యవసాయ సుభిక్షం కోసమే భూసార కేంద్రాలు
వ్యవసాయాన్ని సుభిక్షం చేసేందుకే భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భూసార పరీక్షా కేంద్రాలన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన పని లేదని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లోనే ప్రయోగశాలలను భూసార పరీక్ష కేంద్రాలుగా మార్చేద్దామని చెప్పారు. భూసార ప్రయోగశాలల వల్ల రైతులకు ప్రయోజనకరం ఉంటుందన్నారు. తమ విద్యార్థులే భూసార పరీక్షలు నిర్వహించి రైతుకు ఫలితాలు అందిస్తారని పేర్కొన్నారు. రైతులు కష్టాలో ఉన్న విషయం అందరికీ తెలుసు.. వారిని ఆదుకోవాలా? లేదా అని ప్రశ్నించారు. భూసార కార్డులు ఎందుకిస్తున్నాం.. పండించే రైతుకు భూసారం తెలియాలి కదా అని అడిగారు. ఇష్టానుసారంగా రసాయన ఎరువులు ఉపయోగిస్తున్నాం.. భూమికి ఏమైందో తెలుసుకున్నామా అని ప్రశ్నించారు. అందుకే భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశానికి ప్రజల శక్తి సామర్థ్యాలే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దేశంలో చోటు చేసుకున్న సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు.అస్సీ ఘాట్‌లో ఏమైందని ములాయం అడిగారని, ములాయం కేంద్ర రిపోర్ట్ కార్డు అడిగారా? ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానిదా? అని మోదీ ప్రశ్నించారు. ఉపాధి హావిూ కాంగ్రెస్ వైఫల్యానికి సజీవ తార్కాణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆ పథకాన్ని తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు.