మహాశివరాత్రోత్సవం

మాఘ బహుళ చతుర్దశి వేళా …

మనసంతా భక్తి  పరవశ హేలా …

జగమంతా శివనామస్మరణ మేలా

ప్రాతఃకాల క్షణాల

స్నానమాచరణలు

నవ్య వస్త్రాధరణలు

మందిర అలంకరణలు

ప్రమిదల దివ్య తేజస్సుతో

ప్రతి వదనం ప్రసన్నమయమే

ప్రతి సదనం పవిత్ర మందిరమే

 

పవిత్ర పూజలు

సహస్రనామ స్తోత్రాలు

లింగాత్మక ఆరాధనలు

ధ్యాన మంత్రోత్సరణలు

ఓం హరోం హార నాదాలతో…

ప్రతి స్వర శృతి శివనామమే

ప్రతి పాద జతి శివతాండవమే

 

విభూతి ధారణలు

మారేడు దళ పూజలు

అర్చనలు, అభిషేకాలు

ధూపదీప నైవేద్ధ్యార్పణలు

వ్రతాలు, ఉపవాస దీక్షలతో …

ప్రతి తలపు పులకితబరితమే

ప్రతి తనువు నిర్మలసుగంధమే

 

ఈ శుభకర మంగళ వేళా

భక్తి శ్రద్ధలతో దీక్ష ఆచరించిన

మహాలింగ దర్శనం గావించిన

ప్రతి హృదయం పుణ్యాత్మకమే

ప్రతి జీవితం మోక్షం సంప్రాప్తమే

                              కోడిగూటి తిరుపతి

                     Mbl no ;9573929493