మహిళపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు
మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహాబూబాబాద్‌లో ఒక మహిళపై యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. గత కోద్ది రోజుల నుంచి అతను వేధిస్తుండటంతో ఆమె పోలీసులక ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.