మహిళలకు అండ షీ టీం: ఎస్సై కొండల్ రెడ్డి

గరిడేపల్లి, నవంబర్ 9 (జనం సాక్షి): సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సూర్యాపేట టౌన్  డిఎస్పి  నాగభూషణం   ఆధ్వర్యంలో  గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ  కొండల్ రెడ్డి సహకారంతో  గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో పోలిస్ కళా బృందం చేత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.పోలీస్ కళాబృందం చేత  ఓటిపిఫ్రాడ్స్  షీ  టీమ్స్  మహిళల భద్రత రక్షణ డైల్ 100 సోషల్ మీడియా సైబర్ నేరాలు సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాలు గురించి యువత చెడు వ్యసనాల బారిన పడకుండా వంటి అంశాల గురించి ఆట పాటల  ద్వారా గ్రామ ప్రజలకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గరిడేపల్లి  పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె కొండల్ రెడ్డి , గ్రామ సర్పంచ్   జోగు సరోజినీ, షీ టీమ్స్ ఏ ఎస్ ఐ పాండు నాయక్ , హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి ,జాఫర్ , మహిళా కానిస్టేబుల్  సాయిజ్యోతి ,                               శివరాం ,  పోలీస్ కళాబృందం యల్లయ్య , గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ  , పోలీస్ సిబ్బంది  మట్టయ్య  ,నగేష్  ,గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.