మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన మున్సిపల్, ఐకెపి అధికారులు

– విజేతలకు బహుమతులు అందించిన  ఏ పి యం ప్రసన్న రాణీ   మున్సిపల్ కమిషనర్ జీవన్ కుమార్
ఎల్లారెడ్డి ఆగస్టు 20 ( జనం సాక్షి,) భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఐకెపి ఆధ్వర్యంలో వేరువేరుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు వేసి రంగులు నింపారు. వారిలో విజేతలను ఎంపిక చేసి, వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంపీపీ మాధవి బాలరాజు గౌడ్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత 15 రోజులుగా స్వాతంత్ర సంబరాలను నిర్వహించుకుంటున్నామని, ఇది ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఈరోజు నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని ఇది అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ మరింత ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కౌన్సిలర్లు అల్లం శ్రీను, టిఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రాజు, తిరుపతి, లింగం, ఇమ్రాన్, మున్సిపల్ సిబ్బంది ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి, సీసీ లు సుజాత, సంధ్య, సావిత్రి, గోపాల్, శ్రీను, అకౌంటెంట్ మహేష్, వివిధ గ్రామ ల నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.

తాజావార్తలు