మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలి.

ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పున్నం చందర్.మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో బి వై నగర్ లో నిర్వహించిన సదస్సులు మనోవికాస కేంద్రం సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ మహిళలు వీలైనంత మేరకు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు దైనందిన జీవితంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలను ఎదుర్కొంటు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మనోవికాస కేంద్రం సిబ్బంది రాపల్లి లత ,కొండ ఉమా, శ్రీమతి వేముల అన్నపూర్ణ పలువురు మహిళలు పాల్గొన్నారు.

తాజావార్తలు