మహిళల ఆర్థిక ప్రగతే.. ప్రభుత్వ లక్ష్యం

గోదావరిఖని, జులైౖ 30 (జనంసాక్షి) :  మహిళల కు ఆర్థిక ప్రగతి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీ హాల్‌లో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పలుపథకాల్లో మహిళలకు ప్రయోజనాల ను మంత్రి పంపిణీ చేశారు. దీపం పథకం క్రింద 1348 గ్యాస్‌ కనెక్షన్లను, పావలా వడ్డీ రూపంలో 22మంది వికలాం గులకు రూ.33,923 రుణాలు, సామర్థ్యం పెంపుదల క్రింద 17 సంఘా లకు రూ.7,39,707ల ఆర్థిక సహాయాన్ని, జాతీయ కుటుంబ ప్రయోజనం కింద 51 మందికి రూ.2,55,000 ఆర్థిక లబ్ధిని మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యతా ఆడపడు చుకులకు ఉందన్నారు. దీపం పథకం కింద ఒక్కొక్క గ్యాస్‌ కనెక్షన్‌కు రూ.1,400లను గ్యాస్‌ కంపెనీలకు ప్రభుత్వమే చెల్లించి, సబ్సిడీ క్రింద మహిళలకు గ్యాస్‌ కనెక్షన్‌ను అందచేస్తుందన్నారు. అయితే దీపం పథకం నేరుగా మహిళలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ పథకం విషయంలో మధ్యవర్తిత్వాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. ఈ పథక విషయంలోనే కాకుండా ఏ ప్రభుత్వ పథక విషయంలోనైనా దళారులుంటే వారి భరతం పడతామని, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. అధికారులు చిత్తశుద్ధితో పేద ప్రజానీకానికి ప్రభుత్వ పథకాలం దేలా పాటుపడాలన్నారు. పేదకుటుంబంలోని మహిళలకిచ్చే ప్రభు త్వ పథకాలను పటిష్టంగా అమలుపరచాలన్నారు. విధానపరమైన నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతం స్థాయిని పెంచిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ ప్రాంతంలో 3లీటర్ల కిరోసిన్‌ను, 5కిలోల గోధుమలను రేషన్‌కార్డు హోల్డర్‌కు అందిస్తున్నామ న్నారు. రంజాన్‌, వినాయకచవితి సందర్భంగా ఇప్పుడిచ్చే చక్కెరకు అదనంగా అరకిలో చక్కెరను రేషన్‌ దుకాణాల్లో అందించనున్నట్లు తెలిపారు. రామగుండం ప్రాంతంలో మరో 3వేల గ్యాస్‌ కనెక్షన్లను దీపం పథకం క్రింద అందిస్తున్నామన్నారు. మంచినీటి సదుపా యాన్ని అందించడానికి కృషి జరుపుతామన్నారు. కార్పొరేషన్‌ అధి కారులు ఈ ప్రాంత అభివృద్ది పట్ల చిత్తశుద్థితో పనిచేసి, అభివృద్ధిని సాధించాలని ఈ ప్రాంతప్రజలు ఎటువంటి సమస్యలతో ఇబ్బం దులు పడకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్య నారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బడికెల రాజలింగం, మాజీ వైస్‌ చైర్మన్‌ తానిపర్తి గోపాల్‌రావు, నాయకులు బాబర్‌ సలీంపాష, హర్కాల వేణుగోపాల్‌, కౌశిక హరి, ఆరె దేవరుణ, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.

రూ.8కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజవిన్‌ల్లో నిర్వహిం చతలపెట్టిన రూ.8కోట్ల 9 లక్షల 28 వేల అభివృద్ధి పనులకు స్థానిక ప్రధాన చౌరస్తాలో మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. బిఆర్‌జిఎఫ్‌, ప్లాన్‌ గ్రాంట్‌, 13వ ప్రణాళిక, ఫ్లడ్‌గ్రాంట్‌ క్రింద రూపొందించిన 100పనుల్లో భాగంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనే జీల, రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ శంకు స్థాపన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వివేక్‌, రామగుండం ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ, కార్పొరేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రచార రథం ప్రారంభం…

రామగుండం కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న చెత్తపై సమరం కోసం… స్థానిక మేదరిబస్తీలోని హెర్క్యులస్‌ షోరూం నిర్వాహకులు బహుక రించిన ప్రచారరథాన్ని మంత్రి ప్రారంభించారు. చెత్తపై సమరం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు షోరూం నిర్వాహకులు శంకర్‌ పాల్గొన్నారు.