మహిళల ప్రపంచకప్ భారత జట్టు ప్రాబబుల్స్ ఎంపిక
ముంబై ,నవంబర్ 30: వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి భారత జట్టు ప్రాబబుల్స్‌ను ఇవాళ ప్రకటించారు. నేషనల్ వుమెన్ సెలక్షన్ కమిటీ 30 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఆడిన క్రీడాకారిణులందరికీ ఈ జాబితాలో చోటు దక్కింది. గ్రూప్ స్టేజ్‌లో ఒక్క విజయం కూడా సాధింకపోయినా… ఆఖరి మ్యాచ్‌లో లంకపై గెలవడం ద్వారా 2014 టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు భారత్ అర్హత సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు భారతే ఆతిథ్యమిస్తోంది. 2013 జనవరి 31 నుండి ఫిబ్రవరి 17 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. భారత్‌తో పాటు ఆస్టేల్రియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి.
ప్రాబబుల్స్ ః
మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్, అమితా శర, సులక్షనా నాయక్, ఝులన్ గోస్వామి, రీమా మల్హోత్రా, పూనమ్ రౌత్, గౌరా సుల్తానా, ఏక్తా బిస్త్, అర్చనా దాస్ , సుబ్బలక్షి, రసనారా పర్వీన్, అనూజ పాటిల్, నిరంజనా
, మోనా మిశ్రమ్, సునీత ఆనంద్, ఎండి తిరుష్కమిని, లతిక కుమారి, నిశితా ఫారాసి , వేదా కృష్ణమూర్తి, శ్వేత జాదవ్, రితూ ధ్రుబ్, మోక్షా చౌదరి, కవితా పాటిల్, పూనమ్ యాదవ్, కరుణా జైన్, మందిరా మహాపాత్ర, అనాగ్ దేశ్‌పాండే, నిషు చౌదరి, సుష్మ వర్మ.