మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

 

(ఆదివారం తరువాయి భాగం)
సామాజిక పరిణామ చరిత్ర
మనం మన హక్కుల కోసం అడుక్కోవడం కాదు. పోరాడి సాధిద్దాం అనే స్పృహ కలిగిన స్త్రీ అసలు తన హక్కుల్ని ఎలా కోల్పోయిందో తెలుసుకోవాలంటే సామాజిక పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయక తప్పదు. క్రిస్టియన దేవుడు ఒక ఆడంని, ఒక ఈవ్‌ని సృష్టించి సహజీవనం చేయమన్నంత సులువుగా ఈ పరిణామం జరగలేదు. ఆ చరిత్రలో ఒక జీవన పోరాటం ఉంది. శ్రమశక్తి ఆద్బావన ఉంది. చేతి ఉపయోగాన్ని తెలుసుకోవడం ఉంది. శ్రమ విభజన ఉంది. ఆహారాన్వేషన ఉంది. వ్యవసాయం ఉంది. అగ్నిని కనుక్కోవడం ఉంది. పనిముట్ల తయారీ ఉంది. చివరగాద సంపద ఉంది. స్త్రీని అణగదొక్కిన ఆర్థిక ప్రాతిపాదిక ఉంది. అది కల్పిం చదిన వారసత్వం ఉంది. దోపిడీ ఉంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మా ణంలో తేడాల వల్లనే పురుషులు అధికులు, స్త్రీలు అధములు అయిపోయారనే వితండవాదానికి అంత్రపాలకాజిస్టులు(మానవ పరిణామ విశ్లేషకులు) ఏనాడో సమాధానం చెప్పారు. ఆదిమ సమా జంలో, నానరుడి నుంచి మానవుడు పరిణామం చెంది, రెండు కాళ్ల జీవిగా అభివృద్ది చెందిన కాలం నించి మిగులు సంపద పోగయే కాలం వరకు స్త్రీ ఉన్నత స్థాయిలో ఉండేది. ఆదిమ వ్యవస్థలో మాతృస్వామ్యం అమలయ్యేది. ఆనాడు ఆమెకి సృజనాత్మకత , సామాజిక సాంస్కృతిక శక్తి అపారంగా ఉండేది.
మరి ఆ సబల ఈనాటి అబలగా ఎలా తయారయింది?
ఆదిమ సమాజంలో హెచ్చుతగ్గులు లేవు. మానవత్వం ఉండేది. ఆడ, మగ వివక్ష లేదు. అమెరికన్‌ లూయీ మోర్గన్‌, బ్రిటిష్‌ ఎడ్వర్డ్‌ టైలర్‌ ఈ పరిణామ క్రమాన్ని సహేతుకంగా, శాస్త్రీయంగా విశ్లేషిం చిన ఆంత్రపాలజిస్టులు. ఈ భూమి మీద దాదాపు 99 శాతం కాలం వేటాడుతూ బతికే ఆటవిక కాలంగానే నడిచింది. ఎనిమిది వేల ఏళ్ల క్రితం మాత్రమే వ్యవసాయం, పశుపోషణ దశ ఆరం భమయింది. ఐదువేల ఏళ్ల క్రితం నేటి నాగరిక సమాజం ఉద్భవి ంచింది. డార్విన్‌, మోర్గన్‌ల పరిశోధనలతో ఉత్తేజితులై మార్క్స్‌, ఎంగెల్స్‌లు కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుకను స్పష్టంగా నిర్వచించారు. సామాజిక పరిణామంలో ‘ఆంత్రపాయిడ్‌’ (కోతి) నుంచి ‘హ్యూమనాయిడ్‌’ (మనిషి) దశకి రూపాంతరం శ్రమ వల్లనే జరిగిందని ఎంగెల్స్‌ నొక్కి చెప్పారు. మొదటగా ఆదిమ కమ్యూనిజంలో ఉత్పత్తి సాధనాలు అందరివీ, వాటిమీద ఎవరి పెత్తనం లేదు. రెండవది, ధనికవర్గాలకు కాపుకాసే రాజ్యం ఆనాడు లేదు. ఆదిమ తెగల సమాజం స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్న దశ. దాని సభ్యులంతా సమానులే. అక్కడ ఆడ, మగ తేడా కూడా లేదు. మూడవది, ఆనాడు అది మాతృస్వామిక దశ. ఆనాటి స్త్రీ పిల్లల్ని కంటూ కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండేది. సామాజిక, సాంస్కృతిక జీవనంలో ప్రధాన పాత్ర పోషించేది. ఆనాడు సొంత ఆస్తి లేదు. అలానే, పిల్లల్ని ఆస్తిలా చూసు కోవడమూ లేదు. గార్డెన్‌ చైల్డ్‌ వంటి సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు, ఆదిమ సమాజంలో మహిళలు అనేక ఉత్పత్తి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మానవాభివృద్దికి ఎంతగానో దోహదపడ్డారు. పురుషులు వేటకి వెళ్లెవారు, వేటలో ఆహారం తప్పకుండా దొరుకు తుందన్న హామీ లేదు, స్త్రీలు దుంపలు, ఆకులు, అలుములు ఏరు కుంటూ తిరిగేవారు. ఆ ఆహారాన్వేషణ నికలడయింది. తప్పకుండా ఆహారం దొరికేది. ఈ క్రమంలోనే విత్తు నుంచి మొక్క మొలవడాన్ని గ్రహించిన స్త్రీ వ్యవసాయానికి మూల స్తంభమైంది. మరోవైపు మట్టి పాత్రల తయారీ, తోళ్ల వాడకం, నిప్పుని ఉపయోగించి వంట నేర్వడం, తర్వాతి కాలంలో ఇళ్లు కట్టడం, చేనేతలు వంటి ఎన్నో ప్రక్రియలను ఆమె చెపట్టింది. అలా స్త్రీ బీజ రూపంలో బాటనీ, కెమిస్ట్రీ, వైద్యం తదితర శాస్త్రీయ విజ్ఞానాన్ని కలిగి ఉండేది. ఉత్పత్తిలో భాగం పంచుకుని ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తూ రైతుగా, చేతి వృత్తుల కళాకారిణిగా, తొలి గురువుగా తరతరాలకు తన జ్ఞానాన్ని అందిస్తూ, సమాజంలో గుర్తింపు పొందింది. అలా, ఎంగెల్స్‌ చెప్పిన ఉత్పత్తి, పురుత్పత్తి అనే సమాజపు రెండు రంగాల్లోనూ ఆమెదే పై చేయిగా ఉండేది. అంటే, శారీరకమైన తేడాల వల్ల స్త్రీ అధోగతిపాలు కాలేదని అర్థం.
మరి తిరోగమనం ఎలా ఆరంభమయింది? వ్యవసాయంతో, పశుపోషణతో అభివృద్ది సాధ్యమయింది. ఇనుము, ఇతర లోహాల తమారీతో ఈ అభివృద్ది ద్విగుణీకృతమయింది. ఆత్పత్తి పెరిగింది. అవసరాలను మించిన ఉత్పత్తి మిగులుగా, సంపదగా పోగుప డింద. మనిషిని, మనిషి దోచుకునే ప్రాతిపదిక తలెత్తింది.చ వర్గా లు, దోపిడీ పీడనలు, సొంత ఆస్తి తలెత్తాయి.య ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసం వారసులు కావాలి.చ అందుకు ఏకపత్ని వ్యవస్థ అవసరం.చ అలా పురుషుడు సంపదకు హక్కుదారయ్యాడు. ఎంగెల్స్‌ చెప్పినట్లు ‘ఏకపత్నీ వివాహ వ్యవస్థలో పురుషుడికీ, స్త్రీకి మధ్య పెంపొందిన వైరుధ్యమూ, మొదటి వర్గ వైరుధ్యమూ ఏకకాలంలో తలెత్తాయి. అలానే స్త్రీ జాతిని పురుష జాతి అణచివేయడం, మొట్టమొదటి వర్గ దోపిడీ ఏకకాలంలో తలెత్తాయి. అంటే, వర్గ సమాజం ఆవిర్భావం తోటే స్త్రీ అణచివేత ఆరంభమ యింది. మూలాల్ని గ్రహిస్తేనే అణచివేతని సమూలంగా ఎలా అంతం చేయాలో అర్థమవుతుంది. లైంగిక అసమానత వర్గ అసమా నత వెంబడే వచ్చింది. అలా వర్గ దోపిడీ కింద కులం, మతం, రాజ్యం అనే గుదిబండలు మోస్తున్న పురుషులు ఉంటే, స్త్రీలు అద నంగా పురుషాధిక్యత అనే భారాన్ని మోస్తున్నారు. అందుకే, తక్షన సమస్యలపై ఎన్ని పోరాటాలు చేసినా, అంతిమంగా వర్గ పోరాటాలతోటే సంపూర్ణమైన స్త్రీ విముక్తి సాధ్యం.
పిడికిలెత్తిన మహిళలు
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నిటిలో స్త్రీ అణచివేతకి గురైనాగాని, సామాజిక ప్రతిఫలనాలకి వ్యతిరేకంగా మొట్టమొదటి ఉద్యమాలు అరంభమయ్యాయి. మహిళోద్యమం అంచెలంచెలుగా ఎదిగింది. ఒక్కొక్క దశలో అది ఒక చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చింది.
మహిళోద్యమంలో స్థూలంగా కొన్ని దశలు:
1857-1947 – జాతీయయోద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడం.
1947-57 – స్వతంత్ర భారతం తొలి సంవత్సరాల్లోస్తబ్దుగా ఉన్న దశ.
1957-75 – భ్రమలు వదిలి అన్ని పోరాటాల్లో పాలుపంచుకోవడం.
1975-90 – స్వయం ప్రతిపత్తి గల మహిళా గ్రూపుల ఏర్పాటు దశ.
నేటి వరకు – ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ బడుగు వర్గాల మహిళలు చురుగ్గా ముందుకు వస్తున్న దశ.
సంస్కరణోద్యమం :
మొదటగా 19వ శతాబ్దంలో సంస్కరణోద్యమాలు మొదలయ్యాయి. వీటిని పురుషులే ఆరంభించి మహిళా సంఘాలను కూడా ఏర్పరిచారు. కానీ క్రమంగా 19వ శతాబ్దం చివరి నాటికి మహి ళలు స్వయంగా సంఘాలు ఏర్పరుచుకున్నారు. అవి చిన్నగా, స్థానికంగా ఏర్పడినా, ఆ తర్వాత అవి జాతీయ స్థాయిని సంతరిం చుకున్నాయి. ఆనాడు ప్రధానంగా రాజకీయ హక్కులను, వ్యక్తిగత చట్టాల సంస్కరణలను మహిళలు కోరారు. రామ్మోన్‌రాయ్‌ సతికి, బహు భార్యత్వానికి వ్యతిరేకంగా పాటుపడి, మహిళల ఆస్తి హక్కు డిమాండ్‌ని లేవనెత్తారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విధవా వివాహాలను ప్రోత్సహించారు. అదే కాలంలో మన రాష్ట్రంలో విరేశ లింగం, గురజాడ మొదలైన సంఘ సంస్కర్తలు కూడా బార్య వివా హాలను వ్యతిరేకిస్తూ, పైన పేర్కొన్న అన్ని సామాజిక దురన్యా యాలకు వ్యతిరేకంగా నడుము బిగించారు. స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. అలా ముందుకొచ్చిన పురుషుల కుటుంబాల్లోని స్త్రీలు కూడా కదిలి వచ్చి ఉద్యమించారు. ఈ ఒరవడి వామపక్ష సంస్థల్లో కూడా కనిస్తుంది. సావిత్రిబాయి పూలే ఎన్నో సామాజిక ఓడిదుడుకులను ఎదుర్కొంటూ స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ విద్య కోసం పాటు పడింది. టాగోర్‌ సోదరి స్వర్ణకుమారి దేవి ‘భారతి’ అనే మహిళా పత్రికను నడుపుతూ తొలి భారతీయ మహిళా ఎడిటర్‌గా నిలుస్తూ, స్త్రీ విద్యని ప్రోత్సహించింది. పేదలకది, విధవలకి చదువు నేర్పి, వివిధ వృత్తుల్లో శిక్షణనిచ్చి, తమ కాళ్ల మీద తాము నిలబడేల ప్రోత్సహించింది. ఈ దశలో పురుషుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడింది. అటు తర్వాత మహిళలు తమంత తాముగా స్వచ్ఛందంగా సంఘటితం కాసాగారు.
– డాక్టర్‌ నళినీ
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….