మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(సోమవారం తరువాయి భాగం)
1 జాతీయోద్యమం
మహిళలు పెద్ద ఎత్తున కదలడానికి జాతీయోద్యమం దోహదప డింది. బ్రిటిష్ వ్యతిరేక ఆరాట పోరాటాల విస్తరణలో మహిళలు భాగస్వామ్యం విజృంభించింది. అలా మహిళోద్యమం పునాది కూడా విస్తరించింది. భారద జాతీయ కాంగ్రెస్ మూడవ సమా వేశం మహిళల సమస్యను చర్చించింది. 1905లో అందులో మహిళా విభాగం ఏర్పడింది. బాల్య వివాహాలు, వితంతు సమస్య, కట్న పిశాచి వంటి సమస్యలపై అది కేంద్రీకరించింది. బెంగాల్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాధికులైన మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడమే ఆనాడు ఒక విప్లవం. అలా బయటికొచ్చాక, ఇతర మహిళలను కలుసుకునే అవకాశం ఏర్పడింది. అందరూ కలిసి సమాజ సేవలో పాలుపంచుకున్నారు. తమ పరిధిని అందరూ కలిసి విస్తరించుకుంటూ జ్రల సమస్యలపై కేంద్రీకరించి, సంస్థల నిర్మాణాలలో అనుభవం సంపాదించుకున్నారు. అనీ బిసెంట్, మార్గరేట్ కజిన్స్ ఆధ్వర్యంలో మహిళల భారతీయ సంస్థ (డబ్ల్యూఐఎ) ఏర్పడింది. ముఖ్యంగా స్త్రీల ఓటు హక్కు కోసం వీరు పాటు పడ్డారు. సరోజినీ నాయుడు నాయకత్వంలో మహిళలు ఈ డిమాండ్‌ని ముందుకు తెచ్చారు. 23 మంది మహిళల సంతకాలతో మాంటెగు చేమ్స్‌ఫోర్డ్‌కి వినతి పత్రం సమర్పించారు. అలా 1920 నుంచి మహిళలు ఓటు హక్కు సాధించుకున్నా, అది విద్యావం తులకి ఆస్పిపరులకి మాత్రమే పరిమితమైపోయింది. 1935 నాటికి అది ప్రభుత్వ చట్టంగా వచ్చింది. కానీ స్వాతంత్య్రానంతరం మాత్ర మే అది సార్వజనీన ఓటు హక్కుగా రూపొందింది. జాతీయోద్యమ కాలంలో బాల వితంతువులైన దుర్గాబాయి దేశ్‌ముఖ్, కమలాదేవి ఛలోపాధ్యాయ వంటి మహిళల జీవితాలు ఎంతో మార్పు చెందాయి. ఇతర మహిళల జీవితాలు మార్చడానికి వారు ఎంతో కృషి చేశారు. స్వదేశీ ఉద్యమంలో, హోమ్‌రూల్ ఉద్యమంలో మహి ళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటి సహాయ నిరాకర ణోద్య మంలో, ఉప్పు సత్యాగ్రహంలో, శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా వారు పురుషులతో చేతులు కలిపారు. స్వాతంత్య్రం సాధించాలనే దృఢ దీక్షతో , విదేశీ దోపిడీని అంతమొందించాలనే ధృడ సంకల్పంతో మీటింగ్‌దలు నిర్వహిచారు. అంతవరకు వీధి ముఖం చూడని మహిళలు సైతం వేదికలెక్కి ఆత్సాహభరితమైన ఉప న్యాసాలు ఇచ్చేంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నారు. ఊరేగిం పుల్లో పాల్గొని, విదేశీ వస్త్రాలను విక్రయించే దుకాణాలను మూ యించి, జైలుకెళ్లారు. ఇది స్వతంత్రమైన మహిళోద్యమం కాదు, కానీ వలసవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రకాంక్షతో మహిళలు కదిలారు. వారి బలం వారికి తెలిసింది. ఆత్మవిశ్వాసం హెచ్చింది.
జాతీయోద్యమంలో భాగంగా మహిళల ప్రజాస్వామిక పోరాటాలు దేశవ్యాప్తంగా పెరిగాయి. త్రిపురలో రాచరికానికి వ్యతిరేకంగా ఆదివాసి మహిళలు కదిలారు. కుమారి మధుమతి, రూపశ్రీ అనే నాయకులు ప్రాణాలర్పించారు. అస్సాంలో సంస్కరణోద్యమాలు జరిగాయి. మలబార్, కొచ్చిన్, ట్రావన్‌కోర్‌లలో నియంతృత్వ వ్యతి రేక పోరాటాలు, భూ పోరాటాలు జరిగాయి. కయ్యూరు వీరుల కోసం పోరాడారు. తమిళనాడులో భూపోరాటాలు చేస్తూ నిర్భంధాన్ని వ్యతిరేకించారు. మహారాష్ట్రలో తిరుగుబాటుకి గోదా వరి పరులేకర్ నాయకత్వం వహించింఇ. గుజరాత్, పంజాబ్, యుపిలలో కూడా అనేక పోరాటాలు జరిగాయి.
మరోవైపు, పెల్లుబికిన అనేక రైతాంగ పోరాటాల్లో మహిళలు వీరో చితంగా పోరాడారు. పోరాట యోధులకి అండదండగా రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తు, వేగులగా వ్యవహరిస్తూ, వారిని డుపు లో దాచుకుంటూ, మరోవైపు ఎంతో సమరశీలంగా పోరాటాలు చేస్తూ, త్యాగాలు చేసూ, ప్రాణాలొడ్డుతూ, దోపిడీ భూస్వామ్యా వర్గాల గుండెల్లో దడపుట్టించారు. వలసవారుల పథకాలకు పగ్గాలు వేశారు, బొర్సాద్, బర్దోలీ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల సత్యాగ్రహాల్లో మహిళలు పాల్గొన్నారు. తెభాగా తిరుగుబాటులో స్త్రీల పాత్ర గురించి పీటర్ కస్టర్స్ తన పుస్తకంలో చాలా విపులంగా వివరించారు. బెంగాల్ కరువు సమయంలో మహిళా ఆత్మ రక్షణ సమితి(మార్చ్) పేరుతో మహిళలు ఒకటయితే, తెభాగా ఉద్య మంలో ‘నారీ బాహిని’లో అట్టడుగు వర్గాల దైతాంగ, గిరిజన, హిం దూ, ముస్లీం మహిళలు నాయకులయ్యారు. పురుషులు, కమ్యూ నిస్టు పార్టీ జంకిన చోట్ల సైతం వారు ముందుండి నాయకత్వం వహించి ఆదర్శప్రాయులయ్యారు. 1945లో ప్రభుత్వం తన యుద్ద అవసరాలు తీరడం కోసం బస్తాల కొద్దీ వరిధాన్యాన్ని తరలించు కుపోయి కృత్రిమంగా కరువును సృష్టించింది. ప్రజలు ఆ దెబ్బనుం చి కోలుకోక ముందే భూస్వాములు (జోతేదార్లు) పంటలో సగాన్ని దోచుకుంటే, రెండు వంతుల పంట తమకే చెందాలనే డిమాండ్‌తో నడుము బిగించిన కౌలుదార్లు ఉద్యమమే ‘తెభాగా’ . సంవత్సరం పాటు తీవ్ర ప్రతిఘటన ప్రదర్శించిన ప్రజల్లో స్త్రీలు ఆదర్శవం తమైన పాత్ర నిర్వహించారు. కిసాన్ సభతో ప్రభావితమై వారు ఉద్యమించారు. 1946 పంట కోతల సమయంలో ఆరంభమై. 1948-49 వరకు ఈ పోరాటం కొనసాగింది, కౌలుదార్లని పంట కోయనివ్వకుండా భూస్వాముల గూండాలు అడ్డుకుంటే, ప్రజలని ప్రోత్సహించది పంట కోయించింది. జలాపయిగురికి చెందిన మహిళ. తర్వాత దినాజ్‌పూర్, రంగపూర్, మైమన్‌సింగ్, మిద్నపూ ర్, కక్‌ద్వీప్ జిల్లాలకు ఉద్యమం వ్యాపించింది. అప్పటికి పోలీసులు రంగంలోకి దిగి మహిళలను వేధించి, కాల్పులు కూడా జరిపారు. అప్పుడు మహిళలు, ముఖ్యంగా 24 పరగణాల ప్రాంతాంలో విజృంభించారు. పోలీసుల మీద దాడులు చేశారు. ప్రత్యేక సాయుధ దళాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ పోరాట క్రమంలో ఎందరో మహిళలు అసువులు బాసారు. వారిలో అహల్య అనే నాయకురాలు కూడా ఉంది. చివరికి ఉద్యమం ముగిసేసరికి రైతాం గం రెండు వంతుల పంట డిమాండ్‌ని సాధించుకుంది.
‘ మహిళలే పాల్గొని ఉంటే పారిస్ కమ్యూన్ చరిత్ర మరోలా ఉండేది’ అనే లెనిన్ మాటలు గుర్తు చేసుకుంటే, స్త్రీలు నిర్వహించిన వీరోచిత పాత్ర వల్లనే తెభాగా ఉద్యమం ఎన్నో గుణపాఠాలు నేర్పింది.
అలానే, స్వాతంత్య్రానికి ముందు శ్రామిక మహిళలు కొన్ని చోట్ల తమ పోరాట పటిమను నిరూపిం చారు. 1917లో అహ్మదాబాద్ జౌళి కార్మికుల సమ్మెకి అససూయ సారాబాయి నాయకత్వం వహించి ంది. 1920 నాటికి సమ్మెల్లో మహిళల భాగస్వామ్యం గణనీ యంగా పెరిగింది. మణిబెన్ కారా రైల్వే కార్మికుల సోషలిస్టు నాయకు రాలు, జౌళి కార్మికులకి ఉషాబా యి డాంగే, పార్వతి భోరె నాయ కులు. 1928-29లో బొంబాయి, కలకత్తాలలో జరిగిన జౌళి కార్మికుల సమ్మెలో మహిళలు పెద్ద సంఖ్యలో పోరాడారు.
మరోవైపు 1802-03 రంప తిరుగుబాటులో, 1938-41 కొమురం భీము పోరాటంలో ఆదివాసి మహిళలు ముందు కొచ్చారు. బ్రిటిష్ వ్యతిరేక, దోపిడీ వ్యతిరేక సమీకరణల్లో వారు అదర్శవంతమైన పాత్ర వహించారు. 1946లో గోంద్, కొలాం, పర్దాన్ ఆదివాసులు తమ భూమిపై హక్కుల కోసం పోరాడారు.
ఈ దశలో ఒకవైపు దేశభక్తి పెల్లుబికింది. మరోవైపు ప్రపంచాన్ని కుదిపేసిన సోషలిస్టు భావాల ప్రతిఫలాలు దోపిడి వ్యతిరేక పోరాటాల్లో కనిపిస్తాయి. వాటిల్లో స్త్రీల వీరోచిత పాత్ర ఉంది.
2. స్త్రీల పోరాట ఫలితాలే కొత్త చట్టాలు
ప్వాతంత్య్రానంతరం పదేళ్లపాటు ఉద్యమాల్లో కొంత స్తబ్దత కనిపించినా గాని, మహిళల పోరాట పటిమ ఫలితంగానే కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చాయి. స్త్రీల స్థితిగతులు మెరుగుపర చడానికి ఈ చట్టాలు కొంత దోహదపడ్డాయి.
మహిళా సంఘాల ఆందోళనతోనే స్వాతంత్య్రానంతరం స్త్రీలకి సార్వజనీన ఓటు హక్కు సంప్రాప్తించింది. 1947లో వివాహ వయోపరిమితిని పెంచుతూ శారదా ఆక్టు వచ్చింది. బహు భార్యత్వాన్ని నిషేదిస్తూ, విడాకుల చట్టాన్ని, ఆస్తి హక్కు చట్టాన్ని సవరిస్తూ 1950లో హిందూకోడ్ బిల్లు వచ్చింది. మహిళల హక్కుల కోసం, సంక్షేమం కోసం 1947నించి అనేక చట్టాలు ఆమోదించారు. మహిళలు, బాలబాలికల అపహరణ నిషేధ చట్టం (1956), స్త్రీల వివాహ సంబంధం ప్రత్యేకచట్టం (1955), హిందూ వారసత్వం చట్టం (1956), వరకట్న నిషేధ చట్టం (1961), స్త్రీ పురుషుల సమాన వేతన చట్టం (1976), కుటుంబ న్యాయస్థానాల చట్టం(1984), లైంగిక దాడులను, వరకట్న హత్యలను నిరోధించే నేర నిరోధక చట్టం సవరణ ఆక్టు (1985), మహిళల్ని కించపరచడాన్ని నిషధించే చట్టం (1986) తదితరాలు అమల్లోకి వచ్చాయి. కానీ వీటి అమలులో ఉంటూనే ఉన్నాయి. సవరణలు జరిగినా లొసుగులు ఉంటున్నాయి. జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలే తీర్పులని ప్రభావితం చేస్నున్నాయి. అందుకే చట్టాలు స్త్రీలకు కొంత ఆసరా కల్పిస్తాయే తప్పా వాటితో స్త్రీలు విముక్తి చెందరు. జీన్సు తొడుక్కునే మహిళలు సమాజాన్ని పాడు చేస్తారని, ఆడపిల్లలకి సెల్‌ఫోన్లు నిషేదించాలని, ఆడ మగ కలిసి స్వేఛ్చగా తిరగడం వల్లనే మానభంగాలు జరుగుతున్నాయని తప్పుడు వాదనలు ఈనాటికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
– డాక్టర్ నళిని
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….