మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(శుక్రవారం తరువాయి భాగం)
తక్కువ వడ్డీలకు అప్పు ఇవ్వడం, వారి ఉత్పత్తులకు విపణి కల్పిం చడం వంటి వాగ్దానాలతో ఆశలు కల్పించింది. చివరికి వడ్డీ మొత్తా లు పెరిగి మోపెడై స్త్రీల నడుములు విరిగాయి. పథకాల పనితీ రును ప్రశ్నిస్తూ అనేక ఆందోళనలు జరిగాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని, మతా శిశు పోషణని మెరుగుపరిచే విధంగా ఏర్పడిన అంగన్‌వాడీ విధానంలో కూడా అవకతవకలు జరుగుతు న్నాయి. అందీ అందని జీతాల వల్ల ఆ కార్మిక మహిళలు నెలల తరబడి ధర్నాలు నిర్వహిస్తున్నారు. 104సేవల పేరుతో గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ అనే ఆశ కల్పించి, చివరికి ఆ సర్వీసుల్ని రద్దు చేయబోతే, ఆ సేవలు నిర్వహించే ఉద్యోగులు కూడా వీధినపడి పోరాడక తప్పలేదు. ఎన్‌ఆర్‌ఎచ్‌ఎం పేరుతో నడిచే పథకాలన్నీ కుంటి నడక నడుస్తు న్నాయి. 1982లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ కలిసి మతా శిశువుల కోసం ఏర్పరిచిన పోషకాహార మద్దతు కార్యక్రమం ఆ రకంగానే నడుస్తోంది. రాజకీయ రంగంలో హక్కుల కోసం: రాజకీయ ప్రాతినిధ్యం కోసం మహిళలు 1920వ దశకంలోనే ఓటు హక్కు డిమాండ్‌తో ముందుకొచ్చారు. స్వాతంత్య్రం తర్వాత మహిళలందరికీ ఓటు హక్కు లభించినా, పాలనా యంత్రాగంలో వారికి స్థానం దక్కలేదు. ఇండియాలో మహిళల స్థితిగతులను అంచనా వేసే ప్రభుత్వ కమిటీ 1971-74లో తన నివేధికలో ఈ పరిస్థితిపై ఇలా వ్యాఖ్యానించింది. పరిస్థితి ఇలానే కొనసాగితే, తమ సమస్యలని చెప్పుకుంటూ పరిస్థితిని మార్చుకునే అవకాశం తమకి లేదనే నిరాశతో మహిళలు రాజకీయ విధానంలో ఆసక్తిని కోల్పోయి, ఆ విధానంలో పాల్గొనడానికి నిరాకరించి, స్తబ్దుగా మారవచ్చు, లేదా తిరుగుబాటుదారులుగా తయారయ్యే అవకాశం ఉంది అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ పంచాయితీల్లో మహిళల ప్రాతినిధ్యానికి పచ్చజెండా ఊపాడు. ప్రాంతీయ స్వయంపాలన అనుభవంతో మహిళలు రాష్ట్ర ప్రభుత్వాల్లో, పార్లమెంట్‌లో కూడా ప్రాతినిధ్యాన్ని కోరుతూ ఉద్యమించారు. 33 శాతం రిజర్వేషన్‌ డిమాండ్‌తో అన్ని మహిళా సంఘాలు కలిసి ఉమ్మడి పోరాటం సాగించాయి. అయితే ఆ బిల్లుతో నిజమైన సాధికారికత ఎంత వరకు ఉంటుందో వేచి చూడవలసిందే. కేవలం ఈ సాధికారికత ఎంతవరకు ఉంటుందో వేచి చూడవలసిందే. కేవలం ఈ సాధికారత వల్లనే మహిళ స్థితిగతులు మారిపోవనే అవగాహన కూడా అవసరం.ముంపుకి వ్యతిరేకంగా:రాజమండ్రి నుంచి భద్రాచలానికి పడవలో వెళ్తుంటే విశ్రాంతి కోసం ఆగే అందమైన పేరంటాలపల్లిలో చిన్న చిన్న వాగులు కనువిందు చేస్తాయి. పక్కనే ఉన్న కొండ మీదకి ఎక్కితే అక్కడి ప్రజలు వెరుదుతో చేసి అందమైన పూలగుచ్చాలను అమ్ముతూ కనిపిస్తారు. వాటిని తెచ్చి మన ఇంట్లో అలంకరిస్తే పోలవరం గుర్తుకొచ్చి బాధనిపిస్తుంది. అక్కడ ప్రాజెక్టు వల్ల నీళ్లు ముంచితే ఇంకా పైపైకి పోతామే తప్ప ఆ ప్రాంతాన్ని విడిచిరామంటూ పదిహేను గడపల మహిళలు అక్కడే స్థిరంగా ఉండి పోయారు. పౌరహక్కుల సంఘాల, ప్రజా సంఘాల నేతృత్వంలో మహిళలు అనేక రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మేధా పాట్కర్‌లు ఇక్కడ కనిపించకపోయినా, అంతే పట్టుదల, స్థైర్యాలు గల అనసూయలు, రాములమ్మలు ఉన్నారు. ఈ సమస్య మీద ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. ఇలా అనే సమస్యలపై మహిళలు సమరశీలంగా ముందుకొచ్చారు. ఇంకా వస్తున్నారు. ఒక్కొక్క పోరాటంలో వారి సంసిద్ధత, సమరశీలత రాటుదేలుతున్నాయి. ఒక్కొక్క ఉద్యమం అంతిమ పోరాటానికి రిహార్సల్స్‌ వంటిదనే మార్కిస్ట్‌ అవగాహ ప్రతి రోజు రుజువవతూనే ఉంది. అందుకే స్త్రీలు విప్లవోద్యమంలో కూడా ఎంతో ఉత్సాహంగా పాలు పంచు కుంటున్నారు.
విప్లవోద్యమంలో:
కష్టాలే ఎదురవ్వనీ/ అజడే వేధించనీ/ జీవితాంతం పోరాడు తాను/ ఉన్నతమైన లక్ష్యం కోసం అన్నాడు. యువ కార్ల్‌ మార్క్య్‌. అదే ఒరవడిలో మహిళలు అనేక దశల్లో విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొని తమ ఉనికిని చాటుకు న్నారు. సమాజం సమూలంగా మారనిదే తమకి సంపూర్ణమైన స్వేచ్ఛ సిద్ధించదని నమ్మి పీడిత రైతాంగంతో, కార్మికులతో, విద్యా ర్థులతో, రచయితలతో, పౌర హక్కుల కార్యకర్తలతో, కళాకా రులతో, పోరాట యోధులతో భుజం భుజం కలిపి పోరాడారు. ఆ క్రమంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చారు. త్యాగాలు చేశారు. ప్రతిఘటించారు. అసువులు బాసారు. ఎమర్జెన్సీకి ముందు 70దశకంలో నక్సల్‌బరీ శ్రీ కాకుళ రైతాంగ ఉద్యమ ప్రభావొం ఎల్లులు దాటి ఆంధ్రప్రదేశాన్ని కుదిపివేసింది. ముఖ్యంగా లేలేత మువత బలంగా స్పందించారు. వివిధ ప్రజాసంఘాలు, ఏర్పడ్డాయి. విద్యార్థి సంఘాలు ఏర్పడి విశధ్యాల యాలతో సహా అన్ని విద్యా సంస్థలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇవి చురుగ్గా పనిచేశాయి. ఇళ్లలో ప్రతిబంధకాలను ఎదిరించి విద్యార్థినులు సాహసోపేతంగా ముందుకొచ్చారు. అరుణోదయ, జననాట్యమండలి వంటి సాంస్కృ తిక సంస్థలు విప్లవ రాజకీయాలతో ప్రజలను ఉత్తేజపరి చాయి. సభలకి, ప్రదర్శనలకి జనం వేలాదిగా కదలివచ్చారు. అనేక అకృత్యాలకు పాల్పడింది. తనకి ఎదురు నిలిచిన పార్టీలను ప్రభావంతో ఈనాటికి ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేని విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆ చీకటి రోజుల్లోనే ్పభుత్వం భూమయ్య- కిష్టాగౌడ్‌లను ఉరితీసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా ప్రజలు స్పందించారు. ఉరితీతలకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ విధించగానే రాత్రికి రాత్రి అరెస్టులు జరిగాయి. తప్పిం చుకున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిన్న పట్టణాల్లో , గ్రామాల్లో వేతన కూలీలుగా చిన్నపాటి డాక్టర్లుగా టీచర్లుగా నిలదొక్కుకొని ప్రజలతో మమేకమయ్యారు. అక్కడ మహిళలు వీరిని కడుపులో దాచుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత వివిధ సంఘాల ఏర్పాటుకు వీరి కృషి ఎంతగానో దోహదపడింది.1977లో ఎమర్జెన్సీ ఎత్తివేయగానే కాంగ్రెస్‌ పాలన అంతం కావడంతో అన్ని ప్రజా సంఘాలు చురుగ్గా పనిచేశాయి. ప్రజాస్వామిక వాతావరణంలో వాటి సభ్యత్వం పెరిగింది. తర్వాత యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతుకూలీ సంఘాలు ఏర్పడ్డాయి. మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. వెట్టి చాకిరీ రద్దు కోసం జరిగిన పోరాటంలో ఆడబాపల విధానం కూడా రద్దయింది. దొరల గడీల ముందు బతకమ్మ ఆడాలలనే నియమాన్ని రద్దు చేశారు. రైతు కూలీల వేతనాలు పెరిగాయి. స్త్రీ పురుషులకు సమాన వేతనం అనే డిమాండ్‌ని సాధించుకున్నారు. తునికాకు కూలీ రేట్లు పెరిగాయి. బంజరు భూముల్లో జెండాలు పాతిన భూ ఆక్రమణ పోరాటాల్లో మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. భూస్వాములు అదనంగా కలిగి ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో కూడా స్త్రీలు ముందున్నారు. రైతు కూలీ సంఘాల్లో… మహిళ సంఘాల్లో తమ గొంతులు వినిపించారు. వేధించే సంఘాల్లో, మహిళా సంఘాల్లో తమ గొంతులు నిలబెట్టారు. అన్ని సమస్యలకీ ప్రజా కోర్టుల తీర్పునే ప్రమాణంగా తీసుకున్నారు. దురాగతాలు చేసిన భూస్వాములను సైతం ఈ కోర్టుల్లో నిలదీశారు. ముక్కు నేలకి రాయించి, చీపుళ్లతో కొట్టి, చెప్పుల దండలు వేసి, ఊరు నుంచి బహిష్కరించి ఒకోసారి మరణదండన విధించి, వారి దురహంకారానికి పై శాచికత్వానికి, దోపిడీ పీడనలకు తగిన శిక్షలు విధించారు. సారాని ఊళ్ల నుంచి తరిమేశారు. దొంగ వ్యాపారులను, పత్పుడు తూకాలను, జీవితాలను చిద్రం చేసే వడ్డీ లెక్కలను ఎండగట్టారు. రుణ పత్రాల ను తగులబెట్టారు. అలా ఉద్యమిస్తున్న గ్రామాల నుంచి వెళ్లి గనుల్లో ఇతర కర్మాగారాల్లో స్థిరపడిన కార్మికులు, ఈ పోరాటాన్ని తమతో పాటు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లారు. అలా బొగ్గు గనుల్లో అగ్గిరాజుకుంది. దినదిన గండంగా గడిచే ఆ జీవితాలకు ఉద్యమం ఒక వెలుగయింది. అక్కడ కూడా గడిచే ఆ జీవితాలకు ఉద్యమం ఒక వెలుగయింది. అక్కడ కూడా మహిళలు క్రియాశీల పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అనేక కుటుంబాలు మొత్తంగా విప్లవోద్యమానికి అంకితమయ్యాయి. మహిళలు ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారు. మూతపడిన జూట్‌ మిల్లుల్ని తెరవాలని, లాకౌట్లు ఎత్తివేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన పోరాటాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు. ఈ పోరాట తాకిడికి ఊళ్లు విడిచి పారిపోయిన దొరలు, భూస్వాముల, వ్యాపారులు పట్టణాల్లో ఆస్తులు సంపాదించుకోని రాజకీయాల్లో చేరి, ఊళ్ల మీదకి పోలీసుల్ని దింపారు. ఐదారేళ్లపాటు జరిగిన తీవ్ర ప్రతిఘటనతో, నిర్బంధంతో ఆ గ్రామాలు అతలాకుతలమై పోయాయి. ఈ క్రమంలో అక్కడి మహిళలు ఉద్యమకారులని కడుపులో దాచుకున్నారు. శత్రువు ఆనుపాలనులని కనిపెడుతూ ప్రజల మనుషులను రక్షించే ప్రయత్నాలు చేశారు. కొందరు మహి ళలు తామే కార్యకర్తలుగా ఎదిగి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి ఉద్యమాన్ని విస్తరింప చేయడానికి సిద్ధమయ్యారు. అంత వరకు ”బాంచన్‌ కాల్మొక్త ” బతుకులుగా ఉన్న జనానికి తలెత్తుకు తిరగడం నేర్పింది ఉద్యమం. దొరల బానిసలుగా దాసీలుగా ఉన్న స్త్రీలు అపర కాళికలై, దొరలకి దడ పుట్టించారు. అన్ని రకాల దోపిడీని అందమొందించే ఉద్యమానికి వెన్నెముకలయ్యారు.
– డాక్టర్‌ నళిని
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….