మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు
(శనివారం తరువాయి భాగం)
ఆదివాసి మహిళల పోరాటాలు: మరోవైపు ఉద్యమం అడవులకు కూడా విస్తరించింది. అడవి మీద, అటవీ మీద అధారపడి, ప్రకృతి లో భాగంగా బతుకుతున్న అనేక గిరిజన తెగల జీవితం ఈనాడు చిన్నాభిన్నమై పోతోంది. బ్రిటీష్ కాలం నుంచి అక్కడ వనరుల దోపిడీ జరుగుతున్నా, ఇటీవల కార్పొరేట్ సంస్థల ధనార్జన కోసం ప్రభుత్వం అడవులనే అమ్మేస్తోంది. అందుకే నదీ పరీవాహక ప్రాం తాలు అంతమైపోతున్నాయి. వనరుల విధ్వంసంతో పాటు జనజీ వన విధ్వంసం కూడా ఏకకాలంలో జరుగుతోంది. దీన్ని ప్రతిఘ టిస్తున్న ఆదివాసులపై ప్రభుత్వం విరుచుకు పడుతోంది. పోలీసు లు, సైన్యం, సల్వాజుడుం లాంటి కిరాయి గూండాలు సాయుధ దళాలు వారి జీవితాలను చిన్నాభిన్నాం చేస్తున్నాయి. వాకపల్లి, బల్లుగూడ వంటి చోట్ల ప్రతిఘటనవి అణచడం కోసం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. భూమి పోయి, ఇల్లు వాకిలి పో యి, మానప్రాణాలు పోయి నిస్సహాయంగా మిగిలిన గిరిజనులు కడుపుకాలి పోరాటాన్ని చేపట్టారు. 1967లో భూములు కోల్పోయి, శిస్తులు కుంగదీస్తుంటే బెంగాల్లో శ్రీకాకుళంలో గిరిజన పోరాటాల్లో మహిళలు చేరారు. ఇంద్రవెల్లి జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మధ్‌యప్రదేశ్ గిరిజన మహిళలు ఆదివాసి ముక్తి సంఘటన్ వంటి సంఘాల్లో చురుగ్గా పని చేశారు. భూస్వాముల భూములకు, గిరిజనేతర భూములకు 1/70 ఆక్ట్ భద్రత కల్పిస్తుంది. సహజ వనరులను బహుళజాతి సంస్థలకు అమ్మడాన్ని ఇది చట్టబద్ధం చేస్తుంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు 19890నుంచి ఆందోళన చేస్తున్నారు. బాక్సైట్ గని తవ్వకాలను ఆపుతున్నారు. వేదాంత వంటి సంస్థలను వెళ్లగొడుతున్నారు. నర్మద, కోయిల్‌కారో డ్యాం నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే ప్రాంతాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవికాక, తునికాకు పోరాటాల్లో ముందు ఉంటున్నారు. వెదురు కోసుకునే హక్కు కోసం డిమాండ్ చేస్తున్నారు. కూలీ రేట్లు, వెదురు, ఇప్పపూల రేట్లుం పెంచుకుంటున్నారు. పూట గడవడం కష్టమైనపుడు కరువు దాడులు చేపడుతున్నారు. ప్రతి ఊళ్లో స్త్రీలు సమరశీలంగాచేసిన భూపోరాటాల వల్ల వాళ్లు తమ భూములను దక్కించుకోగలిగారు. అలాంటి స్త్రీలలో బుచ్చక్క, రాజక్క, ఆత్రంబా యి ఆదర్శంగా నిలిచారు. అంతేకాక, పురుషాధిక్యత వల్ల అమల య్యే అన్ని సామాజిక దురాచారాలను ఈ ఆదివాసి మహిళలు వ్యతి రకించారు. పెళ్లయ్యాక స్త్రీలు జాకెట్టు మానుకోవాలనే ఆచారాన్ని ధిక్కరించి జాకెట్టు వేసుకున్నారు. బలవంతపు పెళ్లిళ్లు మానుకు న్నారు. ఊరిబయట గుడిసెలో నెలవారీ నిర్బంధాన్ని ఆపేశారు. రాజకీయ, ఆర్థిక పోరాటాల్లో పురుషులతో భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. సాయుధులై తమని తాము రక్షించు కోగలుగు తున్నారు. సల్వాజుడూం, గ్రీన్‌హంట్ వంటి నిర్బంధాలను తిప్పకొ ట్టే ప్రయత్నం చేస్తున్నారు. వనరుల విధ్వంసానిన, జీవ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నంలో సింగూరు నించి, కళింగనగర్ నించి టాటాని వెళ్లగొట్టారు. నందిగ్రామ్‌లో కెమికల్ ఫ్యాక్టరీని ఆపారు. సోంపేటలో నాగార్జున థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌ని ఆపారు. నియం గరి కొండల నుంచి వేదాంత కంపెనీని తరిమేస్తున్నారు. ఆదివా సుల మధ్య సుదీర్ఘకాలం గడిపి, వారి బాగోగులని ఆకలింపు చేసు కున్న రచయిత్రి మహాశ్వేతాదేవి బెంగాల్ ప్రభుత్వం చేసే తప్పిదా లను ఎత్తిచూపింది. ప్రభుత్వం కాంట్రాక్టర్లకి రక్షణ కల్పిస్తూ, చెట్లని నరికిస్తుంది. దానివల్ల జంగల్ మహాల్ ఆదివాసులు జీవనోపాధిని కోల్పోతున్నారు. అక్కడ రోడ్లులేవు. మంచి నీళ్లు లేవు. కరెంటు లేదు. ఆదివాసులు బెంగాల్లో ఉన్నంత దయనీయంగా ఇంకెక్కడా లేరని ఆమె బాధపడ్డారు. ప్రజల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోంది. వారు సంఘటితంగా పెట్టిన కొన్ని డిమాండ్‌లను తోసిరాజం టోంది. బాల్‌గఢ్‌లో తన ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్దాన్ని ప్రకటించడం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టింది. దాని బదులు అక్కడి ప్రజలకి తెల్లకార్డులు ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి, సోలార్ లైట్లు ఇచ్చి చూడమంది. అన్ని హక్కులు కోల్పోయిన నిరుపేదలకి, నిర్వాసితులకి అందని స్వాతంత్య్రం ఏమి స్వాతంత్య్రమని ఆమె ప్రశ్నించింది. ఆరుకోట్ల ఆదివాసులు ఉన్న మన దేశంలో మహిళలు ఉపాధి కోసం కొడుకుల మీద ఆధారపడరని ఆమె ఒక ఉదాహరణ లో చెప్పింది. మిడ్నపూర్‌లో తులిబార్‌కి చెందిన అరవయ్యళ్ల కర్మిసోరేన్ తనకు చెందిన చిన్న ఇంటిని, చిన్న మడి చెక్కని తన కొడుక్కి ఇవ్వకుండా గ్రామానికి ఇచ్చేసింది. అలా తులిబార్‌లో మొదటి స్కూల్ వెలిసింది. అంత పెద్ద మనసుగల స్వఛ్చమైన ఆదివాసుల జీవితాలతో ఆడుకుంటోంది ప్రభుత్వం. లాభాపేక్షగల బడా పెట్టుబడిదారులకు అడవిని, దానిలోని వనరుల్ని అమ్మేస్తోంది. అందుకే ‘ఈ నిర్వాసితులకి ఏ స్వేచ్చా లేదు, స్వతంత్య్రమూ లేదు. అరవయ్యేళ్ల స్వతంత్ర భారతదేశంలో వారికి ఏ ప్రాధమిక హక్కూ సంప్రాప్తించలేదు’ అంటుంది మహాశ్వేతాదేవి. ఒకపక్క ఎడ్లబండి, మరోపక్క ఎసి స్కూళ్లు. ఒక పక్క నూలు చీరలు, మరోపక్క మనీస్కర్టులు, వీపంతా కనిపించే జాకెట్లు అడుగడుగునా అలా ఆర్థిక వ్యత్యాసాలు ఇంకా కనిపిస్తుంటే, ఎలాంటి స్వాతంత్య్రం పొం దలేకపోయినా ఆదివాసులు ఇప్పుడు మళ్లీ తమ విముక్తి కోసం పోరుబాట పట్టారని ఆమె విశ్లేషిస్తారు. ఇది బెంగాల్లోనే కాక దేశవ్యాప్తంగా అడవులన్నిటిలో ఉన్న స్థితి. అందుకే గోచిపాతల ఆదివాసులు గొడ్డళ్లు నూరుతున్నారు. లక్ష్యం వైపుగా : అలా ఎన్నో సమస్యలపై మహిళలు కదిలారు, కదులూతూనే ఉన్నారు. అలానే ఆత్పాదక శ్రమలో పాలుపంచుకోవడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. కానీ మన దేశంలో స్త్రీలని వేధిస్తున్న సమస్యలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. పోశకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత, అధిక శ్రమ, నైపుణ్యతాలోపం, వివక్ష, శారీరక మానసిక వేధింపులు, అత్యాచారాలు, ఏ హక్కుటూ లేని నిస్సహాయత, అర్థిక స్వేచ్ఛ లేకపోవడం అనేవి వాటిలో ముఖ్యమైనవి. అందుకే, పేదరికాన్ని నిర్మూలించే వైపుగా చేసే పోరాటాలు ముఖ్యమా, అస్తిత్వ కోసం జరిగే పోరాటాలు ముఖ్యమా అనే చర్చ చాలాకాలం గా జరుగుతూనే ఉంది. పేదరికం ప్రాతిపదికగా స్త్రీలు కోల్పోతున్న ఉనికే ప్రధానం అని చెప్పక తప్పదు.పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల ప్రతిఘటనని నీరుగార్చడం కోసం ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోంది. వాటిలో భాగమే స్వయం పోషక గ్రూపులు(సేల్స్ హెల్ప్ గ్రూపులు- ఎన్‌హెచ్‌జి) వారికి అందజేస్తున్న సూక్ష్మరుణాలు (మైక్రో ఫైనాస్స్) ప్రజల శక్తి సామర్ధ్యాలను తనకి అనుకూలంగా మలుచుకుంటూ వారికి దూరపు కొండలు చూపే ప్రభుత్వం ప్రయత్నమే ఇది. కానీ ఇటీవల ఆ విధానంలో ఏర్పడిన సంక్షోభం అందరికీ కనువిప్పు అయింది. కష్టపడి దాచుకున్న సొమ్ముని చాలా మంది కోల్పోయారు. అప్పుల ఊబిలో కూరుకున్నారు. సమస్య మూలాల్లోకి వేళ్తే, ఈనాడు సమాజాభివృద్దికి పురుషునితో పాటు స్త్రీలను కూడా వినియోగించుకోలేని సమాజంలో మనం ఉన్నాం. జనాభాలో సగం మాత్రమే ఉత్పత్తిలో పాలు పంచుకుంటే, ఎన్ని వనరులున్నా ఆ దేశం దిగజారుడుగానే ఉంటుంది. పైగా, ఇప్పుడు ఆ వనరులు, వాటిపై పెరిగే సంపద కొద్దిమంది చేతుల్లో చిక్కుకుంది. ఆస్తిహక్కు పేరుతో, ఇతర దోపిడీ విధారాల దన్నుతో కొందరు కోట్లకి పడగలెత్తుతుంటే, మెజారిటీ ప్రజలు రోజు రోజుకీ పేదరికంలో కూరుకుపోతున్నారు. ఆర్థవలస, ఆర్థి భూస్వామ్య విధానం కొత్త కొత్త రూపాల్లో ప్రజలని అధోగతి పాలు చేస్తోంది. అందుకే ఈనాడు మన దేశంలో దాదాపు నలభై శాతం మంది దారిద్య్రరేఖకి దిగువ ఉన్నారు. అలాంటి అణగారిన మెజారిటీ ప్రజలు విముక్తి చెందడం కోసం ఆరాటపడుతుంటే , మహిళలు వారితో కలిసిపోరాడుతూ, సకల మానవాళి స్వేచ్ఛలో తమ స్వేచ్ఛ ఇమిడి ఉందని నమ్ముతూ, అంచెలంచెలుగా తమ ప్రజాస్వామిక హక్కుల్ని పొందాలి. మహిళలుగా తమ ప్రత్యేక హక్కుల కోసం పోరాడాలి, ఫైజ్ చెప్పనట్లు ‘ఏక్ ఖేత్ నహీ, ఏక్ దేశ్ నహీ, హమ్ సారీ దునియా యాంగేంగే!’.
రజనీ దేశాయ్ మాటల్లో చెప్పాలంటే ‘మనకి ఇంకా ఇంకా కావాలి. మరింత ఉత్పాదకత కావాలి. దానికోసం మరింత స్వేచ్ఛ కావాలి. అలా పొందిన అదనపు విలువని మనవాళి కోసం వినియోంగించాలి. భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులు, కోర్టులు, పోలీసులు, మిలిటరీ-అన్నీ కలిసి మనల్ని దోచుకుంటుంటే వారి నించి విముక్తి కోసం పురుషులు చేసే పోరాటంలో మనమూ భాగస్వాములు కావాలి. ఆ స్వేచ్ఛని కోరే హక్కు మనికి ఉందని పురుషులకి తెలియజెప్పాలి. అందుకే, ఉత్పత్తి సాధనాలపై ఆధిపత్యం కోసం దోపిడీదారులకు వ్యతిరేకంగా చేసే పోరాటం శత్రువైరుద్యం ఆ పోరాటాలలో మనకి చేదోడుగా ఉండే పురుషులతో మనది మిత్ర వైరుద్యం. అయితే ఇది కూడా చాలాఇ కీలకమైన పోరాటమే. ఎందుకంటే, దీనివల్ల సగం జనాభా విముక్తి చెంది, అసలైన పోరాటంలో పాలుపంచుకునేలా ఎదుగుతుంది. లేకపోతే, అర్ధాకలితో బాధపడుతూ, నిరుద్యోగంలో కూరుకుపొయి, జీవితానికి భద్రతలేక, అణచివేతకి గురయ్యే పురుషులు ఉంటే, వారితో కోరుకునే సమానత్వానికి అర్ధం లేదు’.
– డాక్టర్ నళిని
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….