మహిళా ఉద్యోగినులకు వేధింపులు
విచారణ చేపట్టిన మహిళా కమిషన్
విజయనగరం,ఆగస్ట్14( జనం సాక్షి ): విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న జీఎస్టీ కార్యాలయంలో మహఙలా ఉద్యోగులకు వేధింపులపై రాష్ట్ర మహిళా కవిూషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి విచారణ చేపట్టారు. కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో తమను వేధిస్తున్నారంటూ వారం రోజుల క్రితం ముగ్గురు మహిళా ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం జీఎస్టీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఉమామహేశ్వరి, రాణీ రత్నకుమారి అనే ఇద్దరు మహిళా ఉద్యోగులు జీఎస్టీ జాయింట్ కవిూషనర్ ఎన్. శ్రీనివాసరావు తమకు.. నైట్ డ్యూటీలు వేసి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు జాయింట్ కవిూషనర్ ఎన్.శ్రీనివాసరావు మహిళలను మానసికంగా వేధిస్తున్నారన్న ఆరోపణపై విచారణ చేపట్టేందుకు వచ్చామని తెలిపారు. మహిళా ఉద్యోగులను నైట్ డ్యూటీల పేరుతో వేధించడం దారుణమన్నారు. మహిళలకు హైవేలపై నైట్ డ్యూటీలు వేయకూడదని తెలిసినా జాయింట్ కవిూషనర్ శ్రీనివాసరావు డ్యూటీలు వేస్తున్నారన్నారు. విచారణ సమయంలో జాయింట్ కమిషనర్ అందుబాటులో లేరని తెలిపారు. నైట్ డ్యూటీలు, ఆదివారాల డ్యూటిలు మహిళలకు వేయకూడదని ఆదేశించారు. జాయింట్ కమిషనర్ కి హెచ్చరిక జారీ చేస్తానని, ఆదేశాలు పాటించని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మహిళలెవరైనా పనిలో సమస్య ఎదుర్కొంటే తన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తెలియజేయాలని, అన్ని వేళలా మహిళలకు తాను అందుబాటులో ఉంటానని చెప్పి మహిళా ఉద్యోగులకు చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి భరోసానిచ్చారు.