మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన :జడ్పిటిసి రణం జ్యోతి.
దౌల్తాబాద్ అక్టోబర్ 17, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ జడ్పిటిసి నిధుల నుండి మహిళా భవన నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ నాటి నుంచి 8 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. గ్రామాలు పట్టణాలుగా దినదినంగా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగిరి,ఎంపీటీసీ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area