మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలి.
మూఢనమ్మకాలను తొలగించాలి.
14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనులకు వెళ్లకుండా తల్లిదండ్రులను చైతన్య పరచాలి.
ఏపిఎం నిరంజన్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10 (జనంసాక్షి):
మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని ఏపిఎం నిరంజన్ కోరారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను సభ్యులకు వివరించడంతో పాటు ఆదర్శ గ్రామంగా ఎంపికయ్యేందుకు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనను నిషేధించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటడం తో పాటు 14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనులకు వెళ్లకుండా పాఠశాలలకు వెళ్లే విధంగా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు గృహహింసల నిషేధానికి మద్యపానాన్ని రూపుమాపేందు కు అంటరానితన నిర్మూలనకు ప్రతి మహిళా సంఘం సభ్యురాలు కృషి చేయాలని కోరారు.మైనర్లకు వివాహం జరిగినట్లయితే వారు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరు దీనిని గుర్తుంచు కోవాలని తెలిపారు గ్రామంలో 34 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని ప్రతి సభ్యురాలు సంఘంలో చేరాలని కోరారు. బ్యాంకుల నుండి స్త్రీ నిధి నుండి మండల మహిళా సమక్షం నుంచి తీసుకున్న రుణాలను చెల్లించి ఆర్థిక ప్రయోజనాలు సాధించాలని కోరారు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు కవిత భాగ్యమ్మ ఇందిరమ్మ పుష్ప పద్మమ్మ కళావతి సరస్వతమ్మ సువర్ణ మైబమ్మ నవత వి ఏ ఓ లు మల్లేష్ రాము అంజలి తదితరులు పాల్గొన్నారు