మహోజ్వల భారత కార్మికోద్యమం

(బుధవారం తరువాయి భాగం)

1907లో కూడా అనేక సమ్మెలు జరిగాయి. నవంబర్‌ 18న రైల్వే గార్డులు నిర్వహించిన సమ్మెలో యూరోపియన్లు, ఆంగ్లో ఇండి యన్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమ్మె దేశాన్ని బాగా కదిలించింది. అసన్‌సోల్‌ రైల్వేస్టేషన్‌లో  ప్రారంభమైన సమ్మె తూ ర్పున తుండులా వరకు వ్యాపించింది. కలకత్తాకు ఒక్క ట్రైన్‌ రాకుం డా సమ్మె విజయవంతంమైంది. రెండు వందల మంది గార్డులు రైలు పట్టాల మీద కూర్చొని ఏ రైలు రాకుండా కాపలాకాసారు. మూడు వందల వ్యాగన్‌లు నిలిచిపోయాయి, కలకత్తాలో మిల్లులకు బోగ్గు కొదత ఏర్పడింది. కలకత్తా రేవు నుండి  బయలుదేరవలసిన ఓడలు ఆగిపోయాయి. నవంబర్‌ 24 నాటికి కలకత్తా రేవు ప్రాం తంలో వెయ్యి ఖాళీ వాగన్‌లు, నాలుగు వందల సరుకులను నింపిన వాగన్‌లు నిలిచిపోయాయి. 1907 నవంబర్‌18 నుండి 28 వరకు జరిగిన ఈ సమ్మె మూలంగా వైస్రాయి ప్రధాన కార్యలయమున్న కలకత్తాకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూరి ్తగా తెగిపోయాయి. సోవియట్‌ పరిశీలకుడు ఎఐ లెవ్‌తోస్కి ఇది బ్రిటి ష్‌ వాడి అధికారానికి తీవ్ర విఘాతం . ఈ దెబ్బతో ప్రభుత్వానికి తమ అమోఘమైన శక్తి మీద నమ్మకం సడలించింది’ అని రాసారు.   1906 నాటికి భారతదేశంలో 2న పెద్ద నగరమైన బొంబాయిలో 168 ఫ్యాక్టరీలు ఉండేవి. జనాభా దాదాపు పది లక్షల వరకూ ఉండేది. దానిలో 34 శాతం మంది బట్టల మిల్లులోనూ పనిచే సేవారు. 1905-07ల మధ్య కాలంలో రష్యాలో సాగిన విప్లవ ప్రభావం బొంబాయి కార్మికవర్గం పైన పడింది. భారత బూర్జువా వర్గంలోనూ కలతలు రేగాయి. 1907లో ఇవి సూరత్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభలో బాహటంగా కనిపించాయి. మితవాదులు, అతివా దులుగా చీలిపోయారు. మితవాదులు బ్రిటిష్‌ ప్రభుత్వానికి సహకా రిమిచ్చి, విదేశి వస్తు బహిష్కారాన్ని, హింసా మార్గాన్ని విడనాడాలని వాదించారు. మరోవైపు అతివాదులుగా పిలవబడే వర్గం  ప్రధాన నాయకుడు తిలక్‌ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిం చాలని వాదించారు. తన అనుచరులతో ఆయన కార్మిక వర్గం వద్దకు పోయి ప్రజాపోరాటంలో పాల్గొనవలసిందిగా కోరారు. 190 8 జూన్‌ 24న తిలక్‌ను అరెస్టు చేసి, విచారణ జరిపి జులై 22న దే శద్రోహం నేరం కింద ఆరు నెలల జైలు శిక్ష విధించారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యాపించాయి. అనేక చోట్ల సమ్మెలు, హర్తాళ్లు, ప్రదర్శనలు జరిగాయి. బొంబాయిలో జులై 23న మొదటి సారిగా సార్వత్రిక  సమ్మె జరిగింది. లక్షలాది మంది కార్మికులు రాజకీయ సమ్మెలో పాల్గోన్నారు. ప్రజలు సాయుధ పోలీసులను, సైన్యాన్ని ఎదుర్కొని వీధి పోరాటాలలో  పాల్గొన్నారు. బొంబాయి వీధుల్లో భారత కార్మికవర్గం మొదటి సారిగా వీధి పోరాటాలలో పాఠాలు నేర్చుకొంది. కార్మిక వర్గ విప్లవ పోరాటాలు ఈ సంఘ టనతో కొత్త అధ్యయనాన్ని తెరిచాయి. అంత వరకు  రాజకీయ సమస్యల పట్ల కార్మికుల ప్రతిఘటన చవిచూడని అధికారులు, పరిస్థితిని తీవ్రంగా పరిగణించారు. తెల్లతోలు శాసన రక్షకులు రంగం మీదకి రాగానే నల్లజాతి కార్మికులు పారిపోతారని విశ్వసించారు. తమ వర్గం శక్తినీ, హుందాతనాన్ని పూర్తిగా నమ్ము కొన్న కార్మిక జనాన్ని ఎదుర్కొంటామన్న సంగతి పోలీసులకు ఏ మాత్రం తెలియదు అని డిసి హోమ్‌ వ్యాఖ్యానించారు. సిఎంఎస్‌ఎస్‌ ప్రారంభం నుంచి మహిళలకు ప్రాధాన్యమిచ్చి, వారిని ప్రోత్సహిం చింది. బొగ్గు గనుల్లో దాదాపు సగం మంది మహిళా కార్మికులే. వారిని నాయకత్వ స్థానాలకు ఎదిగేటట్లు బాధ్యత తీసుకున్నారు. దీంతో గతంలో మహిళలపై జరిపే అత్యాచారాలను ఎదిరించే శక్తిగా మహిళా ముక్తి మోర్చా ఏర్పడింది. 1981లో కల్లీ సారా తాగి మహాసముంద్‌ సమీపంలో చాలా మంది కార్మికులు చనిపోయారు. దీంతో సిఎంఎస్‌ఎస్‌ మధ్యపాన నిషేధ ఉద్యమం ప్రారంభించింది. ఈ విధంగా కార్మికుల జీవితాల్ని నాశనం చేసే మద్యపానానికి వ్యతిరేకంగా సింగరేణి బొగ్గు గనుల్లో సింగరేణి కార్మిక సమాఖ్య, సిఎంఎస్‌ఎస్‌లు తప్ప దేశంలో మరెక్కడా ఉద్యమాలు జరిగినట్లు కనిపించదు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సమస్యలపై పోరాడడానికి చత్తీస్‌గడ్‌ ముక్తి మోర్చా ఏర్పడింది. మిల్లు కార్మికులు, రవాణా కార్మికులు, చిన్న వర్క్‌షాపుల కార్మికుల కోసం అనేక కార్మిక సంఘా లు సిఎంఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. రాజ్‌నంద్‌గావ్‌ నుంచి దుర్గ్‌-భిలాయ్‌, రాయపూర్‌ వరకు ఉద్యమం విస్తరించడంతో పారిశ్రామిక యజమాన్యాలు కుట్ర చేసి గూండాలతో సెప్టెంబర్‌ 28, 1991న ఇంటిలో నిద్రిస్తున్న కార్మికనేతను హత్యచేసారు. ఆయన అంత్యక్రియలకు లక్షన్నర మంది కార్మికులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. నియోగి మార్గదర్శికత్వంలో ఎన్నో సృజనా త్మకమైన ప్రయోగాలు జరిగాయి. దల్లీ-రాజహరాలో కార్మికుల కోసం స్వంత షహీద్‌ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రి కార్యకర్తలు బస్తీల్లోని గ్రామాల్లోని పేద ప్రజల ముంగిట్లోకి వైద్యాన్ని తీసుకెళ్లారు. కార్మికుల జీవితంలో ప్రతి రోజూ వారు పనిచేసే ఎనిమిది గంటల సమయానికి మాత్రమే కాక ఇరవై నాలుగు గంటలూ వాళ్ళ జీవిత పరిస్థితుల పట్ల తమ సంఘం బాధ్యత వహించేలా నియోగి కార్యక్ర మాలను రూపొందించాడు. ఆరోగ్యం, విద్య, సంస్కృతి, ప్రకృతి పరిసరాలు, పర్యావరణ కాలుష్యం, స్త్రీ విముక్తి, జాతుల విముక్తి, రైతాంగ విమోచన మొదలైన ఆంశాలన్నింటినీ నియోగి తన సిఎంఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పొందు పరిచాడు. ఈ సామాజిక ఉద్యమాలన్నింటికీ కార్మికవర్గ నేతృత్వం అందించాడని ఆయన సన్నిహితుడైన డాక్టర్‌ పుణ్యవ్రత్‌ గుణ పేర్కొన్నారు.

దత్తా సామంత్‌-చారిత్రాత్మక టెక్స్‌టైల్‌ కార్మికుల సమ్మె

1982లో ఒక ఏడాది పైగా సాగి దేశాన్నంతా ఆకర్షించిన మహోజ్వలమైన టెక్స్‌టైల్‌ కార్మికుల సమ్మెకు దత్తా సామంత్‌ నాయకత్వం వహించాడు. వృత్తిపరంగా ఆయన వైద్యుడు. బొంబా యి శివారు ప్రాంతంలో ఒకటైన ఘట్‌కోపర్‌లో కార్మికుల కాలనీలో డాక్టర్‌గా ప్రారంభమై, కార్మికుల పరిచయాలతో ట్రేడ్‌ యూనియన్‌ రాజకీయాల్లోకి వచ్చాడు. మొదటి క్వారీలో రాళ్ళు కొట్టే కార్మికులకు నాయకత్వం వహించాడు. ట్రేడ్‌ యూని యన్ల ద్వారానే ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్‌ నుంచి మహారాష్ట్ర శాసనసభ  సభ్యుడిగా ఎన్నిక య్యాడు. కాని ఆయన మిలిటెడ్‌ విధానంతో బొంబా యి కార్మికవర్గాన్ని ఆకట్టుకొ న్నాడు. అనేక యూని యన్‌లు స్థాపించి పదిహేను లక్షల మంది కార్మికులకు నా యకత్వం వహించాడు. కొ న్ని బట్టల మిల్లుల్లో నాయ కత్వం వహిస్తున్న శివసేనకు చెందిన గిర్ని కామ్‌గార్‌ సేన కార్మికులకు ద్రోహం చెయ్య డంతో కార్మికులు దత్తా సామంత్‌ను నాయకత్వం వహించమని కోరారు. ఆయన ఆక్టోబర్‌ 30, 1981 లో మహారాష్ట్ర గిర్ని కామ్‌ గార్‌ యూనియన్‌ స్థాపిం చాడు. అప్పటికే మిల్లులలో కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్రీయ మిల్‌ మజ్దూర్‌ సంఘ్‌ (ఆర్‌ఎంఎంఎస్‌), కమ్యూనిస్టులకు చెందిన యూనియన్ల మీద కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సామంత్‌ నాయకత్వంలో కొన్ని మిల్లుల్లో ప్రారంభమైన ఉద్యమం, చివరకు అరవై మిల్లులకు వ్యాపించి రెండు లక్షల యాభైవేల మంది కార్మికులతో జనవరి 18, 1982న బొంబాయి టెక్స్‌టైల్‌ కార్మికుల చరిత్రాత్మక సమ్మె ప్రారంభమైంది. కార్మికులు రోడ్ల మీద పడుకొన్ని ట్రాఫిక్‌ను స్తంభింపచేసారు. రోడ్డు రోలర్‌లు తెచ్చినా కార్మికులు బెదరలేదు. ఈ సమ్మె ఆరు నెలల వరకూ కొనసాగవచ్చని కార్మికుల్ని ముందే హెచ్చరించారు. సంగ్లీ, సతారా, పూనే నుంచి వచ్చిన వారంతా వారి స్థలాలకు వెళ్లిపోయారు. సామంత్‌ స్వయంగా గ్రమాలను పర్యటించి ఆహార ధాన్యాలను సాయం చేయమని కోరారు. రోజూ చాలా మంది గ్రామాల నుంచి బియ్యం బస్తాలతో బొంబాయి వచ్చేవారు. సామంత్‌కు అనుబంధంగా ఉన్న ఇతర యూనియన్ల నుంచి మిల్లు కార్మికుల కోసం మూడు కోట్ల రూపాయలు వసూలు చేసారు. ఈ సొమ్ము కార్మికుల కోసం మూడు కోట్ల రూపాయలు వసూలు చేసారు.ఈ సొమ్ము కార్మికుల వైద్యఖర్చుల కోసం వారి పిల్లల కోసం వారి చదువుల కోసం ఉపయోగించారు. అని ఎంజికెయు ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌ బిలురె తెలిపారు.

స్త్రీ కార్మికుల సాహసం

సమ్మె పోరాటంలో స్త్రీ కార్మికులు అపూర్వమైన సాహసంతో చరిత్ర సృష్టించారు. మమ్మల్ని అరెస్టు చేసి బోయవాడా పోలీస్‌ స్టేషన్‌లో సృషించారు. మమ్మల్ని అరెస్టు చేసి బోయవాడా పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. తర్వాత పోలీసులు టీ, టిఫిన్‌లు పంపిస్తే అవి వసంత దాదా పటెల్‌ (అప్పటి ముఖ్యమంత్రి) పంపినవి, అవి మకక్కర్లేదు, మీరే తినండి అని తిరస్కరించాం మేం నినాదాలు చేస్తూంటే పోలీసులు మమ్మల్ని నోర్మూసుకోండి అని బెదిరించారు. ఎందుకు మూసుకోవాలి  ఈ కుక్కలు మా వల్లనే అధికారంలోకి వచ్చాయి. కాని చూడండి ఏం చేస్తున్నారో అని అరిచాం. రాత్రి అయిపో యిందని మమ్మల్ని ఇళ్లకు వెల్లిపోమన్నారు. రాత్రివేళ మేం ఇళ్లకు వెళ్లలేం అని గొడవ చేఏ్త చివరకు పోలీస్‌ వ్యాన్‌లో  మమ్మల్ని ఇళ్ల దగ్గర దించారు.

-పి.వి.రమణ

వీక్షణం సౌజన్యంతో..

తరువాయి భాగం రేపటి సంచికలో..