మాచర్ల గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు దూడ మృతి
అగస్టు 27( జనం సాక్షి)గట్టు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామంలోగత వారం రోజులు క్రితం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే మరవక ముందే మరొక సంఘటన మాచర్ల గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు దూడ మృతి శనివారం చెందింది.మాచర్ల గ్రామానికి చెందిన బోయ వీరేష్ ఆవుదూడగా గ్రామస్తులు గుర్తించారు ఆవు దూడ విలువ 40 వేలు రూపాయలు ఉంటుందని తెలిపారు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు అదికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అదుకోవాలని కోరారు మాచర్ల గ్రామంలోని సంత బజార్ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ సంఘటన చోటుచేసికొన్నట్లు గ్రామస్థులు తెలిపారు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతము జరగకుండా చూసుకోవాలని మాచర్ల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు
