మాజీ ఎంపి ఉండవల్లి దారెటు?
కిరణ్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరేనా?
రాజమండ్రి,జూలై7(జనం సాక్షి): విభజన తరవాత ఎపిలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ జూలు విదిల్చాలని చూస్తోంది. ఆపరేషన్ ఆకర్శ్ చేపట్టి పాతకాపులను చేర్చుకునే క్రమంలో చిట్టా విప్పుతోంది. రాహుల్ న ఏరుగా ఇస్తున్న సూచనల మేరకు కాంగ్రెస్ వీడిన జాబితాలో ఉన్న వారిని మళ్లీ బుజ్జగించి దరికి చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ నెల 13న కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది. తనతోపాటు తనకు సన్నిహితులైన, మరే పార్టీలో చేరని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలనూ కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. 13న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో, అధిష్ఠానం పెద్దలతో కిరణ్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. భేటీ అనంతరం కాంగ్రెస్ లో చేరికపై లాంఛనంగా ఆయన ప్రకటన చేస్తారని తెలిపాయి. అయితే ఇందులో ఉండవల్ల అరుణ్ కుమార్ తదితర నేతుల ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల ఉండవల్ల వైకాపాలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ ఉండవల్లని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉండవల్లి ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. ఇకపోతే సబ్బంహరి లాంటి నేతలు కూడా వస్తారని అంటున్నా ఎవరెవరు వస్తారననే విషయాలను కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా చూసుకుంటున్నారని సమాచారం. కాంగ్రెస్‌లో చేరడంపై ఇంతకాలం దాటవేస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు చేరికలకు తానే నాయకత్వం వహిస్తున్‌ఆనరని సమాచారం. తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానంటూ చెబుతూ వచ్చిన కిరణ్.. చూద్దామంటూ సమాధానమిచ్చారు. గతంలో ఆయన బిజెపిలో చేరుతారంటూ కూడా ప్రచారం సాగింది. రాష్ట్రంలోకాంగ్రెస్ బలోపేతం కావాలంటే.. టిడిపిని బలంగా ఢీకొనాలని చూస్తున్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాతకాపులను,బలమైన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని రాహుల్ భావిస్తున్నారు. అధిష్ఠానం ఆలోచన మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఇటీవల హైదరాబాద్‌లో నల్లారితో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య చర్చల సారాంశాన్ని అధిష్ఠానానికి ఊమెన్ వివరించారు. ఈ నెల 13న రాహుల్ సమక్షంలో జరిగే సమావేశంలో కిరణ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. ఇదే క్రమంలో ఎవరెవరు చేరుతారన్నది ఆసక్తిగా మారింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. ఏపీలోనూ మంచి రోజులొస్తాయని ఉమెన్ చాందీ ఇప్టపికే సూచించారు. మొత్తంగా కాంగ్రెస్‌లో చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.