మాజీ ఎంపీ విఠల్‌రావు ఇకలేరు
హైదరాబాద్ ,మే28(జనంసాక్షి): మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ విఠల్‌రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. 2004లో విఠల్‌రావు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఏపీ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా కూడా ఆయన పనిచేశారు. విఠల్‌రావుకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.