– మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ మండల యువత ఆధ్వర్యంలో నిర్వహణ.
బూర్గంపహాడ్, ఆగష్టు19(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో సామాజికవేత్త నవీన్ బాబు ఆర్మీ అధినేత నవీన్ బాబు పుట్టినరోజు వేడుకలు మండలంలో మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ మండల యువ నాయకులు నాగిరెడ్డి, హరీష్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మణుగూరు క్రాస్ రోడ్ నుండి భారీ కాన్వాయ్ తో నవీన్ బాబు ఆర్మీ సభ్యులు సారపాక ప్రధాన కూడలి వరకు ర్యాలీగా వచ్చి ప్రధాన కూడలిలో భారీ కేక్ కట్ చేసి అభిమానులు ఆర్మీ సభ్యుల కు స్వీట్లు మిఠాయిలు తినిపించారు. అనంతరం ర్యాలీగా భద్రాచలం వెళ్లి భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు భారీ కేక్ కట్ చేసి ర్యాలీగా సారపాక నుండి రెడ్డిపాలెం మీదుగా గొమ్మూరు కాలనీ చేరుకొని ప్రధాన కూడలి నందు భారీ కేక్ కట్ చేశారు. నవీన్ బాబుకు అడుగడుగున ఆయన అభిమానులు పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం బూర్గంపహాడ్ చేరుకొని పెట్రోల్ బంకు వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలోని ముంపు గ్రామాల నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వారికి సంఘీభావాన్ని ప్రకటించి ర్యాలీగా మొరంపల్లి బంజర చేరుకొని గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బత్తుల వెంకటేశ్వర రెడ్డి నీ పరామర్శించి, అనంతరం గ్రామ కుడలి నందు విజయకాంత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ సభ్యులు అభిమానులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.