మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు మృతి

` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత
హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు పైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1986 ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉమ్మడి ఆంధప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేసిన నాదెండ్ల నెలరోజులపాటు సిఎంగా కొనసాగారు. నాదెండ్ల భాస్కర్ రావు మతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ తరపున ఏపీ మంత్రిగా సేవలందిస్తున్నారని తెలిసిందే. ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. గత నెల రోజులుగా నాదెండ్ల భాస్కరావు మతి పట్ల మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ’భాస్కరరావు మతి రాజకీయ రంగానికి తీరని లోటు. ఎంతోమంది నేతలకు రాజకీయ ఓనమాలు నేర్పిన గొప్ప మార్గదర్శి నాదెండ్ల భాస్కర్ రావు. ప్రజా ప్రతినిధిగా భాస్కరరావు చేసిన సేవలు చిరస్మరణీయం. 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, అంతకుముందు మంత్రిగా ఆయనకు పరిపాలనపై గట్టి పట్టు ఉండేది. చట్టసభల పనితీరుపై ఆయనకు అపారమైన అవగాహన ఉంది. గుంటూరు జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు’ అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

 

తాజావార్తలు