మాజీ సీఎం వైయస్ ఆర్ 13 వ వర్ధంతి వేడుకలు

:శామీర్ పేట్, జనం సాక్షి : తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దేవరయాంజాల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్ వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తుంకుంట మున్సిపాలిటీ 4 వ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి ,తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్ ,రాము ,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి, ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్ , మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్
కార్యదర్శి హరిగోపాల్ , హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ ,ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిక్షపతి ,బాబు ,పాండు ,దుర్గయ్య ,రాకేశ్ ,తదితరులు పాల్గొన్నారు.
2ఎస్పీటీ -1:నివాళులు అర్పిస్తున్న నాయకులు